/rtv/media/media_files/2025/03/11/jhKmrMnZkU5GiW4JaxEa.jpg)
Andhra Pradesh Assembly unanimously approved SC Classification Bill
BREAKING: SC వర్గీకరణ బిల్లుకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. శాసనసభ తీర్మానాన్ని కేంద్రానికి పంపనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. జనగణన తర్వాత జిల్లాల వారీగా కేటగీరిల విభజన చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అలాగే బుడగజంగం కులాన్ని ఎస్సీలో చేర్చాలంటూ చేసిన తీర్మానాన్ని ఆమోదించింది.
గ్రూపుల వారిగా రిజర్వేషన్ శాతం
ఈ మేరకు కింద చూపిన విధంగా గ్రూపుల వారిగా రిజర్వేషన్ శాతం వర్తించనుంది.
1. గ్రూప్ A (రెల్లి & సబ్ క్యాస్ట్ ) 1%
2.గ్రూపు B (మాదిగ & సబ్ క్యాస్ట్ ) 6.5%
3.గ్రూప్ C (మాల & సబ్ క్యాస్ట్ ) 7.5%
1.మొదటి 100 రోస్టర్ పాయింట్స్ లో గ్రూప్ A వారికి 1%, గ్రూప్ B వారికి 6%, గ్రూప్ C వారికీ 8% వర్తించనుంది.
2. రెండవ 100 రోస్టర్ పాయింట్స్ లో గ్రూప్ A వారికీ 1% గ్రూప్ B వారికీ 7%, గ్రూప్ C వారికి 7% కేటాయించారు.
Also Read : అడుక్కోవడం ఎందుకు.. తిరుమల దర్శనాలపై సీఎం రేవంత్ సంచలన కామెంట్స్!
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణకు తాము కట్టుబడి ఉన్నామని గతంలోనే చెప్పినట్లు గుర్తు చేశారు. ఆ మాట నిలబెట్టుకుంటున్నామని, అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపితే సమస్య పరిష్కారం అవుతుందని గతంలోనే చెప్పానన్నారు. ‘ఏబీసీడీ కేటగీరి విభజన కోసం 1996లో కమిటీ వేశాం. ఉమ్మడి ఏపీలో రేషనలైజేషన్, కేటగీరిలపై 2000 ఏడాదిలో చట్టం చేశాం. ఆ చట్టాన్ని కోర్టు కొట్టివేసింది. ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందేనని ఉషా మెహ్రా కమిషన్ నివేదిక ఇచ్చింది. స్థానిక సంస్థల్లో కల్పించాల్సిన రిజర్వేషన్లపై కూడా కమిటీ అధ్యయనం చేసింది. ఎస్సీ వర్గీకరణ సాకారం కావడంలో నా ప్రయాణం కూడా సుదీర్ఘంగా సాగింది. మొదట కమిటీ వేసినప్పటి నుంచి సుప్రీంకోర్టు తీర్పు వచ్చేవరకు ఉండటం నా అదృష్టం' అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
Also read : ముస్కాన్ కంటే డేంజర్ ... ప్రియుడితో కలిసి భర్తను లేపేసి సంచిలో
అలాగే ఎస్సీల పట్ల వివక్ష ఇంకా కొనసాగుతుండటం బాధాకరమన్నారు. అంటరానితనం నిషేధానికి జస్టిస్ పున్నయ్య కమిషన్‌ను తానే వేశానన్నారు. అంటరానితనం రూపుమాపడానికి ఎన్నో జీవోలు జారీ చేశామని, ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారానికి ఎస్సీ, ఎస్టీ సెల్ ఏర్పాటు చేశామన్నారు. హోటళ్లు, మంచినీటి బావుల వద్ద వివక్ష పాటించకుండా చట్టపరంగా చర్యలు తీసుకున్నామని చెప్పారు. సాంఘిక సమానత్వంపై ఎన్నో అవగాహన సదస్సులు నిర్వహించామని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు.
(sc-classification | cm-chandrababu | telugu-news | today telugu news | latest-telugu-news)