/rtv/media/media_files/2025/02/27/Ee6hm0SpcvgIK8cXH30u.jpg)
man cheated rs 100 crores in chitti at hyderabad
ఇది అత్యంత దారుణమైన మోసం. పైసా పైసా కూడబెట్టి చిట్టి వేసేవారికి ఒక హెచ్చరిక కూడా. కొన్నేళ్లుగా చిట్టీ వ్యాపారం చేస్తున్న ఓ వ్యక్తి సడెన్‌గా తన వద్ద ఉన్న రూ.100 కోట్లకు పైగా సొమ్ముతో ఉడాయించి షాకిచ్చాడు. దీంతో ఈ విషయం తెలిసి చిట్టీ వేసుకున్న బాధితులు లబోదిబోమంటున్నారు. అయ్యో ఎంతపని జరిగిందే అంటూ మహిళా బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..
అనంతపురం వాసి
పుల్లయ్య, భూలక్ష్మి అనే దంపతులు ఏపీలోని అనంతపురం జిల్లా యాడికి మండలం చందన లక్ష్మీంపల్లి గ్రామానికి చెందినవారు. వీరు ఉపాధి కోసం 18 ఏళ్ల కిందట హైదరాబాద్ నగరానికి వచ్చి బీకేగూడ రవీంద్రానగర్ కాలనీ సమీపంలోని సీ-టైపు కాలనీలో ఉంటున్నారు. ఇక పుల్లయ్య పెద్దగా చదువుకోలేదు. దీంతో కొన్ని నెలలు అడ్డాకూలీగా పనిచేశారు. అలా అక్కడ చాలా మందితో పరిచయం పెంచుకున్నాడు.
ఇది కూడా చూడండి: Aadi Pinishetty: భార్యతో ఆది పినిశెట్టి విడాకులు.. అసలు విషయం బయటపెట్టిన హీరో
15 ఏళ్లుగా చిట్టీల వ్యాపారం
ఆ పరిచయాలతో కూలి పని మానేసి.. చిట్టీ వ్యాపారం మొదలెట్టాడు. అలా దాదాపు 15 ఏళ్లుగా చిట్టీల వ్యాపారాన్ని పుల్లయ్య నిర్వహిస్తున్నాడు. సుమారు రూ.5 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు చిట్టీలను నిర్వహించేవాడు. ఈ క్రమంలో నగరానికి కొత్తలో చిన్న గుడిసెలో ఉండే పుల్లయ్య.. ఒక్కసారిగా కోటీశ్వరుడైపోయాడు. ఇంద్రభవనంలాంటి ఇళ్లు కట్టేశాడు. అదే సమయంలో తన వద్ద చిట్టీ వేసిన వారికి డబ్బులు ఇచ్చేవాడు కాదు.
ఇది కూడా చూడండి: National: సిద్ధాంతాలు తుంగలో తొక్కేసిన కమ్యూనిస్టు పార్టీ.. బీజేపీతో దోస్తీకి సై!
2వేల మంది బాధితులు
అధిక వడ్డీ ఆశచూపి తనవద్దే ఉంచుకుని.. మళ్లీ వాళ్లతోనే కొత్తగా చిట్టీ వేయించేవాడు. సర్లే చాలా ఏళ్లుగా చిట్టీ వేస్తున్నాం కదా.. ఎప్పుడూ ఏ సమస్యా రాలేదనే ఉద్దేశంతో బాధితులకు కూడా అనుమానం రాలేదు. అది మాత్రమే కాకుండా తెలిసిన వారి వద్దనుంచి సైతం అధిక వడ్డీకి రూ.కోట్లు అప్పు చేశాడు. అందిన సమాచారం ప్రకారం.. దాదాపు 2వేల మంది పుల్లయ్య వద్ద చిట్టీ వేసినట్లు తెలిసింది.
ఇది కూడా చూడండి: ఒకే వేదికపై తమిళ్ హీరో విజయ్ దళపతి, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్
రూ.100 కోట్లతో పరార్
ఇక చిట్టీ వేసిన వారి ఒత్తిడి ఎక్కువ కావడంతో ఫిబ్రవరి 23 నుంచి 26వ తేదీలోపు డబ్బులు ఇస్తానని పుల్లయ్య నమ్మించాడు. ఈ లోపే ఫిబ్రవరి 21న తన ఫ్యామిలీతో కలిసి ఉడాయించాడు. ఈ విషయం తెలిసి దాదాపు 700 మందికి పైగా బాధితులు పుల్లయ్య ఇంటి వద్దకు చేరుకుని కన్నీరు పెట్టుకున్నారు. ఇలా బాధితుల లెక్క బట్టి చూస్తే.. పుల్లయ్య దాదాపు రూ.100 కోట్లకు పైగా సొమ్ము చెల్లించకుండా పారిపోయినట్లు తెలుస్తోంది. వీరు మాత్రమే కాకుండా ఇంకా చాలా మంది బాధితులు ఉన్నట్లు సమాచారం.