/rtv/media/media_files/2025/03/02/Ur517tJEV6k5w4ri5w2v.jpg)
anantapur road accident 4 people died on single family
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పుట్టింట్లో ఒడి బియ్యం పెట్టుకుని అత్తారింటికి వెళ్తుండగా.. ముగ్గురు మహిళలు, మూడు నెలల చిన్నారి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అతి వేగంగా వచ్చిన ఒక కారు ఆటోని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురు మహిళలు అక్కా చెల్లెల్లు కావడంతో ఆ గ్రామంలో తీవ్ర విషాఛాయలు అలముకున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఇది కూడా చూడండి: హిందువుగానే పుట్టా.. అలాగే చనిపోతా : డీకే శివకుమార్ సంచలన కామెంట్స్ !
ఆటోను ఢీ కొట్టిన కారు
అనంతపురం జిల్లా రాయం పల్లికి చెందిన సరస్వతి తన అక్కా చెల్లెళ్లతో కలిసి పుట్టిళ్లు మార్తాడు గ్రామానికి వెళ్లింది. అక్కడ పుట్టింట్లో ఒడి బియ్యం పెట్టుకుని తిరిగి అత్తారింటికి బయల్దేరింది. ఆటోలో తిరుగు ప్రయాణం అయ్యారు. అదే సమయంలో బళ్లారి నుండి అనంతపురం వైపుకు వెళ్తున్న ఒక కారు.. ఎదురుగా వస్తున్న ఆటోను బలంగా ఢీకొట్టింది. సరిగ్గా అనంతపురం మండలం కమ్మూరు వద్ద ఈ ప్రమాదం జరిగింది.
ఇది కూడా చూడండి: TG News: గద్దర్ సినీ అవార్డులపై భట్టి కీలక ప్రకటన.. ఆ పండగరోజే ప్రారంభం!
ఈ ప్రమాదంలో సర్వసతితో పాటు ఆమె 3నెలల కుమార్తె విద్య శ్రీ అక్కడకక్కడే ప్రాణాలు విడిచారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వెంటనే వారిని అనంతపురంలోని సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ నీలమ్మ, యోగేశ్వరి తుది శ్వాస విడిచారు. అయితే ఈ మరణించినవారు ఒకే ఫ్యామిలీ వాళ్లు కావడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
ఇది కూడా చూడండి: IAS అధికారికి వంగా మాస్ కౌంటర్ .. అది అనవసరమంటూ..
పెళ్లికి నో చెప్పడంతో దారుణం
యువతి పెళ్లికి నిరాకరించిందని ఆమె తల్లిపై ఓ యువకుడు దాడి చేసిన దారుణ ఘటన కరీంనగర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే రామడుగు మండలంలో రాజ్ కుమార్ అనే యువకుడు ఉన్నాడు. ఇతను అదే గ్రామానికి చెందిన ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని ఆమె వెంట పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లి కూతురికి వేరే వ్యక్తితో పెళ్లి సంబంధం కుదిర్చింది.
ఇది కూడా చూడండి: హిందువుగానే పుట్టా.. అలాగే చనిపోతా : డీకే శివకుమార్ సంచలన కామెంట్స్ !
యువతి ఫిర్యాదు చేయడంతో..
రాజ్‌కుమార్ ఈ విషయం తెలుసుకుని ఆగ్రహానికి గురై తల్లిపై దాడికి పాల్పడ్డాడు. యువతి తల్లి గొంతు నులిమి హత్య చేయడానికి ప్రయత్నించాడు. వెంటనే స్థానికులు గమనించి ఆమెను కాపాడారు. యువతి ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.