/rtv/media/media_files/2025/04/06/a2CMNuRbaLbDBKL1ZEM1.jpg)
Fire Accident in Anakapalli Kailasapatnam
అనకాపల్లిజిల్లా కైలాసపట్నంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బాణాసంచా కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే స్పాట్‌లో ప్రాణాలు కోల్పోయారు. మరికొందరికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. వెంటనే వారిని సమీప హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. సంఘటనా స్థలంలో మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తుంది.
Also Read: సుంకాలు 90 రోజుల విరామం ఎఫెక్ట్.. భారీ లాభాల్లో భారత స్టాక్ మార్కెట్లు..
AP Inter Students Suicide
ఇదిలా ఉంటే ఇవాళ ఏపీలో మరికొన్ని విషాదాలు చోటుచేసుకున్నాయి. ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలైన తర్వాత రాష్ట్రంలో విషాదకర ఘటనలు వెలుగులోకి వచ్చాయి. పరీక్షల్లో ఫెయిలయ్యామనే మనస్తాపంతో ముగ్గురు విద్యార్థులు దారుణమైన నిర్ణయాలు తీసుకుని ఆత్మహత్యలకు పాల్పడ్డారు. విశాఖపట్నం జిల్లా కొండపేటకు చెందిన చరణ్ తేజకు సెకండియర్ ఫిజిక్స్‌లో కేవలం 10 మార్కులే రావడంతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Also Read: హెచ్ 1బీ వీసా, గ్రీన్ కార్డ్..నిత్యం ఉంచుకోవాల్సిందే..వలసదారులకు స్ట్రిక్ట్ రూల్స్
ఇదిలా ఉంటే .. నంద్యాల జిల్లా బండిఆత్మకూరు మండలంలో ఫస్ట్ ఇయర్‌లో ఫెయిలైన చిన్న మస్తాన్ అనే విద్యార్థి కూడా జీవితాన్ని అర్థారతంరంగా ముగించుకున్నాడు. నెల్లూరు జిల్లా చింతారెడ్డిపాలెం ప్రాంతంలో మరో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలు విద్యార్థుల మానసిక ఒత్తిడిని, సమాజంలో ఉన్న అణచివేత వాతావరణానికి అద్దం పడుతున్నాయి.
కర్నూలు జిల్లా ఆదోనిలో ఇద్దరు సబ్జెక్టుల్లో ఫెయిలైన ఓ బాలిక ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అయితే, ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాలతో బయటపడింది. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. ఈ ఘటనలు చూస్తే, విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై సమాజం, విద్యా సంస్థలు మరింత శ్రద్ధ చూపాల్సిన అవసరం ఎంత ఉందో తెలుస్తోంది.
(fire accident | anakapalli | latest-telugu-news | telugu-news)