/rtv/media/media_files/2025/04/08/xkzoYXRBGHnNLYmP5uf3.jpg)
Pawan Kalyans Son Mark Shankar
Pawan Son Accident : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డాడు. అక్కడి పాఠశాలలో చదువుతున్న శంకర్ ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. అయితే విషయం తెలిసిన వెంటనే ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్.. విశాఖ పర్యటనను రద్దు చేసుకుని సింగపూర్ వెళ్తున్నారు. ఈ మేరకు ఆయన గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. కాగా పవన్ కళ్యాణ్ కుమారుడికి ప్రమాదం వార్త తెలిసి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. పవన్ కళ్యాణ్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read: ఆ నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోండి..లేదంటే...చైనాకు ట్రంప్ హెచ్చరికలు!
" సింగపూర్‌లోని ఒక పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ కళ్యాణ్ గారి కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డారని తెలిసి నేను షాక్ అయ్యాను. ఈ క్లిష్ట సమయంలో నా ఆలోచనలు వారి కుటుంబం గురించే ఉన్నాయి. మార్క్ శంకర్ త్వరగా, పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నాను." అంటూ పవన్ కళ్యాణ్‌ను ట్యాగ్ చేస్తూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. రాజకీయాల్లో ఉప్పూనిప్పూలా పవన్ కళ్యాణ్, వైఎస్ జగన్ ఉంటారు. అయితే ఇలాంటి సమయంలో వైఎస్ జగన్ హుందాగా వ్యవహరించారని.. నెటిజనం కామెంట్లు చేస్తున్నారు.
I am shocked to know about the fire accident at a school in Singapore in which @PawanKalyan garu's son, Mark Shankar got injured. My thoughts are with the family in this difficult time. Wishing him a swift and complete recovery.
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 8, 2025
Also Read: Bigg Boss 9: కింగ్‌కు రెస్ట్.. బరిలోకి బాలయ్య- బిగ్ బాస్ 9 ఫుల్ కంటెస్టెంట్ లిస్ట్ ఇదే..
మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం మార్క్ శంకర్ ప్రమాదంపై స్పందించారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు."సింగపూర్‌లోని ఒక పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కుమారుడు మార్క్ శంకర్ గాయపడినట్లు తెలుసుకుని దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఆ చిన్నారి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. I pray for the well being of the young boy" అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
సింగపూర్‌లోని ఒక పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం @PawanKalyan గారి కుమారుడు మార్క్ శంకర్ గాయపడినట్లు తెలుసుకుని దిగ్భ్రాంతికి లోనయ్యాను
— KTR (@KTRBRS) April 8, 2025
ఆ చిన్నారి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. I pray for the well being of the young boy
ఇక వైసీపీ నేత, మాజీ మంత్రి రోజా కూడా మార్క్ శంకర్ ఇవనోవిచ్ ప్రమాదంపై ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారి చిన్నబాబు మార్క్ శంకర్ ప్రమాద వార్త నా మనసును ఎంతో కలచివేసింది. ఆ చిన్నారి త్వరగా కోలుకొని, దీర్ఘాయుషు మరియు ఆరోగ్యంతో కుటుంబంతో కలసి ఆనందంగా గడపాలని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానంటూ రోజా ట్వీట్ చేశారు.
ఈరోజు @PawanKalyan గారి చిన్నబాబు మార్క్ శంకర్ ప్రమాద వార్త నా మనసును ఎంతో కలచివేసింది. ఆ చిన్నారి త్వరగా కోలుకొని, దీర్ఘాయుష్ మరియు ఆరోగ్యంతో కుటుంబంతో కలసి ఆనందంగా గడపాలని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను.#Getwellsoon
— Roja Selvamani (@RojaSelvamaniRK) April 8, 2025
మరోవైపు పిఠాపురం టీడీపీ ఇన్‌చార్జ్ వర్మకూడా ట్విట్ చేశారు.సింగపూర్‌లోని ఒక స్కూల్‌లో జరిగిన దురదృష్టకర అగ్నిప్రమాదంలో గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకొని ఆరోగ్యంగా మన ముందుకు రావాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను🙏.అని ఆయన ట్విట్ చేశారు.
సింగపూర్‌లోని ఒక స్కూల్‌లో జరిగిన దురదృష్టకర అగ్నిప్రమాదంలో గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకొని ఆరోగ్యంగా మన ముందుకు రావాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను🙏.
— SVSN Varma (@SVSN_Varma) April 8, 2025
Also Read: Today Gold Rate: కిక్కిచ్చిన బంగారం ధరలు.. ఇవాళ భారీగా తగ్గాయ్.. తులం ఎంతంటే?