TTD: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ సేవలు రద్దు!

తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ ముఖ్య సూచనలు చేసింది. మార్చి నెలలో 5 రోజుల పాటు తిరుమలలో శ్రీవారి ఆర్జిత సేవలను రద్దు చేసింది. మార్చినెలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు జరగునున్నాయి. దీంతో ఆర్జిత సేవలను తాత్కాళికంగా రద్దు చేస్తున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది.

New Update
Tirumala

Tirumala

తిరుమల (Tirumala) వెళ్లే భక్తులకు టీటీడీ (TTD) ముఖ్య సూచనలు చేసింది.  మార్చి నెలలో ఐదు రోజుల పాటు తిరుమలలో శ్రీవారి ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. మార్చి నెలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు జరగునున్నాయి. దీంతో ఆర్జిత సేవలను తాత్కాళికంగా రద్దు చేస్తున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. మార్చి 9 నుంచి 13 వరకూ తెప్పోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఐదు రోజుల పాటు సహస్రదీపాలంకార సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం వంటి ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు టీటీడీ వివరించింది. మరోవైపు శ్రీనివాస మంగాపురంలోని కళ్యాణ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు రేపు అంకురార్పణ జరగనుంది.

Alert To Devotees Of Tirumala

ఇక తెప్పోత్సవాల్లో భాగంగా రాత్రి 7 నుంచి 8 గంటల వరకూ శ్రీవారు పుష్కరిణిలో భక్తులకు దర్శనమిస్తారని ఆలయ కమిటీ తెలిపింది. తెప్పోత్సవాల్లో భాగంగా తొలిరోజు సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి తెప్పలపై విహరిస్తారని వెల్లడించారు. శ్రీవారి పుష్కరిణిలో మూడు చుట్లు తిరిగి భక్తులకు అభయప్రదానం చేస్తారని వివరించారు. ఇక రెండో రోజు రుక్మిణీ సమేత శ్రీకృష్ణ స్వామి తెప్పలపై పుష్కరిణిలో విహరిస్తూ భక్తులకు కనువిందు చేస్తారు. మూడోరోజు మార్చి 11న మలయప్పస్వామి మూడుసార్లు పుష్కరిణిలో చుట్టి భక్తులను అనుగ్రహిస్తారు. అలాగే నాలుగోరోజైన మార్చి12వ తేదీన మలయప్పస్వామి ఐదు చుట్లు పుష్కరిణిలో విహరిస్తారు. చివరి రోజైన మార్చి 13న ఏడుసార్లు తెప్పపై పుష్కరిణిలో విహరించి భక్తులను కటాక్షిస్తారని ఆలయ కమిటీ తెలిపింది.

Also Read: అమెరికా నుంచి ఇజ్రాయిల్‌కు చేరుకున్న MK-84 బాంబులు.. ఏ క్షణమైనా యుద్ధం..!

మరోవైపు శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఫిబ్రవరి 17న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జ‌రుగ‌నుంది. అనంతరం ఫిబ్రవరి 18 నుంచి 26వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్బంగా ఫిబ్రవరి 17న సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు మృత్సంగ్రహ‌ణం, సేనాధిప‌తి ఉత్సవం, అంకురార్పణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఫిబ్రవరి 18న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహిస్తారు. ఉద‌యం 8.15 నుంచి 8.40 గంట‌ల మ‌ధ్య ధ్వజారోహ‌ణం జ‌రుగ‌నుంది. అంత‌కుముందు తిరుచ్చి ఉత్సవం నిర్వహిస్తారు.. రాత్రి 7 గంటల నుంచి పెదశేష వాహన సేవ నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలు సందర్భంగా ఉదయం, సాయంత్రం వేళ స్వామివారు వాహన సేవలపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

Also Read: వారి సాయం లేకుండా మేం బతకడం కష్టమే.. జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Heavy rains: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఉరుములు, మెరుపులతో

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలో రాబోయే 2 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఉంటాయని ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు తెలిపారు.

New Update
Rains

Rains

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో రాబోయే రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఉంటాయని ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉమ్మడి కరీంనగర్‌, వరంగల్, ఖమ్మం, సిద్దిపేట, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు వర్ష సూచన ఉంది. అటు ఆంధ్రప్రదేశ్‌లో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు తెలిపారు. 

Advertisment
Advertisment
Advertisment