/rtv/media/media_files/2025/03/23/BiUYIkQqww5qzQ8tTEGY.jpg)
Vidadala Rajini
Vidadala Rajini : వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్‌క్రషర్ యజమాన్యాన్ని విజిలెన్స్ తనిఖీల ముసుగులో బెదిరించి.. రూ.2.20 కోట్లు అక్రమంగా వసూలు చేశారనే అభియోగంపై వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజిని, అప్పటి గుంటూరు ఆర్‌వీఈవో, ఐపీఎస్ అధికారి పల్లె జాషువాతో పాటు మరికొందరిపై ఏసీబీ కేసు నమోదు చేసింది.లంచం తీసుకోవటం, అనుచిత లబ్ధి కలిగించటం, నేరపూరిత కుట్ర, బెదిరింపు తదితర అభియోగాలపై కేసు పెట్టింది. అలాగే డబ్బుల కోసం మైనింగ్ వ్యాపారిని బెదిరించిన విడదల రజిని మరిది గోపితో పాటు ఆమె వ్యక్తిగత సహాయకుడు దొడ్డ రామకృష్ణను నిందితులుగా పేర్కొంది. అవినీతి నిరోధక శాఖలోని సెంట్రల్ ఇన్వెస్టిగేటివ్ యూనిట్(సీఐయూ) శనివారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7, 7ఏతో పాటు ఐపీసీలోని 384, 120బీ, బీఎన్‌ఎస్ఎస్ 173, 176 కింద నలుగురిపై అభియోగాలు నమోదు చేసింది.
Also Read: Horoscope: ఈరోజు ఈ రాశివారికి వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది!
బెదిరింపులు, అక్రమ వసూళ్లపై తొలుత విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు ఫిర్యాదు అందగా.. ఆ విభాగం డైరెక్టర్ జనరల్ హరీష్‌కుమార్ గుప్తా విచారణ జరిపించి, ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఆయన సిఫార్సు మేరకు ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది. ఏసీబీ డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్ ప్రాథమిక దర్యాప్తు చేయించారు. ఆధారాలు లభించటంతో శనివారం కేసు నమోదు చేశారు. ‘2020 సెప్టెంబరు 4న పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం విశ్వనాథుని కండ్రిక గ్రామంలోని శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్‌క్రషర్‌ను అప్పటి చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని పీఏ దొడ్డ రామకృష్ణ సందర్శించారు. స్టోన్‌క్రషర్‌పై దాడులు చేయకుండా, మూయించకుండా ఉండాలంటే రజినిని కలవాలని హుకుం జారీ చేశారు. దీంతో దాని యజమానులు నల్లపనేని చలపతిరావు, నంబూరి శ్రీనివాసరావు రజిని కార్యాలయానికి వెళ్లి కలిశారు. తన నియోజకవర్గ పరిధిలో వ్యాపారం నడవాలంటే అడిగినంత డబ్బులివ్వాల్సిం దేనని, మిగతా విషయాలు తన పీఏ రామకృష్ణతో మాట్లాడాలని రజిని వారితో చెప్పారు. వారిద్దరూ రామకృష్ణను కలవగా ఆయన రూ.5 కోట్లు డిమాండ్ చేశారు.
Also Read: America: మరో విమానంలో అమెరికా నుంచి అక్రమ వలసదారుల రాక..ఈసారి ఎంతమంది వస్తున్నారంటే..?
సెప్టెంబరు 10న అప్పటి గుంటూరు రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి (ఆర్‌వీఈవో)గా ఉన్న ఐపీఎస్ అధికారి పల్లె జాషువా భారీ బృందంతో శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్‌క్రషర్‌పై ఎవరూ ఫిర్యాదు చేయకుండానే విచారణకు వెళ్లారు. అప్పటి విజిలెన్స్ డీజీ అనుమతి కూడా తీసుకోలేదు. విజిలెన్స్ ప్రధాన కార్యాలయానికి ఈ తనిఖీల సమాచారమే ఇవ్వలేదు. విచారణలో వెల్లడైన అంశాలతో నివేదిక సిద్ధం చేశారు. ప్రభుత్వ ఖజానాకు ఎంత నష్టం వాటిల్లిందనేది అందులో లేదు. ఈ నివేదిక డీజీకీ సమర్పించలేదు. అప్పట్లో ఈ తనిఖీల్లో పాల్గొన్న మిగతా అధికారులను ఏసీబీ విచారించగా.. జాషువా ఆదేశాలతోనే తామంతా తనిఖీల్లో పాల్గొన్నామని, తర్వాత విచారణ ఏమైందో కూడా తెలీదని వాంగ్మూలాలిచ్చారు. స్టోన్‌క్రషర్‌లో తనిఖీలు జరిపిన నెల రోజుల తర్వాత జాషువా.. దాని యజమానులకు ఫోన్ చేశారు. వెంటనే విడదల రజినిని కలవాలని.. లేకపోతే రూ.50 కోట్లు జరిమానా విధించటంతో పాటు క్రషర్‌ను మూయించేస్తానని బెదిరించారు. దీంతో వారు రజినిని కలిశారు. ఆమె ఆదేశాల మేరకు పీఏ రామకృష్ణతో భేటీ కాగా ఆయన రూ.5 కోట్లు ఇవ్వాల్సిందేనని మరోమారు డిమాండు చేశారు. కొన్నాళ్ల తర్వాత జాషువా మరోసారి క్రషర్ యజమానులను తన కార్యాలయానికి పిలిపించుకుని, త్వరగా సెటిల్ చేసుకోవాలని హెచ్చరించారు.
Also Read: కిచెన్ లో ఖాళీ బుల్లెట్లతో పోలీస్ ఆఫీసర్ ప్రయోగం.. చివరికి ఏమైందంటే..?
ఆయన నుంచి ఒత్తిడి పెరగడంతో స్టోన్‌క్రషర్ యజమానులు రజిని ఆదేశాల మేరకు.. 2021 ఏప్రిల్ 4వ తేదీ రాత్రి ఆమె మరిది విడదల గోపిని పురుషోత్తపట్నంలోని ఆయన నివాసంలో కలిసి రూ.2 కోట్లు ఇచ్చారు. అదే రోజు గుంటూరులో జాషువాకు రూ.10 లక్షలు, గోపిని కలిసి మరో రూ.10 లక్షలు చెల్లించారు. విడదల రజిని ఆదేశాల మేరకే తాము తనిఖీలు చేపట్టినట్లు జాషువా చెప్పారు. డబ్బులిచ్చినట్లు ఎవరికైనా చెబితే క్రిమినల్ కేసులు పెట్టి, వ్యాపారం మూయించేస్తామని బెదిరించారని యజమానులు చెప్పారు’ అని ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. కాగా కూటమి ప్రభుత్వం వచ్చాక విడదల రజిని, జాషువాపై బాధితుడు చలపతి రావు ఈ మేరకు ఫిర్యాదు చేశారు.చలపతిరావు ఫిర్యాదుపై విచారించి వాస్తవాలు వెలికితీసి నివేదిక ఇవ్వాలంటూ కూటమి ప్రభుత్వం విజిలెన్స్ అధికారులను ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేశారు.
Also Read: Punjab National Bnak Scam:బెల్జియంలో ఛోక్సీ..రప్పించేందుకు భారత్ విశ్వ ప్రయత్నాలు!