డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. మరో విడత వైఎస్సార్ సున్నా వడ్డీ విడుదల అప్పుడే!!

సకాలంలో రుణాలు చెల్లించే మహిళలకు ఇప్పటివరకూ వైఎస్సార్ సున్నా వడ్డీ కింద రూ.4,696,05 కోట్లు చెల్లించాలమని చెప్పారు. పొందుపు సంఘాలకు రుణాలపై 9 శాతం వడ్డీ వర్తింపజేసేలా బ్యాంకర్ల సమావేశంలో ఒత్తిడి తెచ్చి చర్యలు చేపట్టామన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని మహిళలు ఆదాయ మార్గాలుగా మార్చుకోవాలని సూచించారు. చేయూత కార్యక్రమంలో స్వయం ఉపాధిని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని సీఎం..

New Update
CM Jagan: టీడీపీ, జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ డ్వాక్రా మహిళలకు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వైఎస్సార్ సున్నా వడ్డీని ఆగష్ట్ 10వ తేదీన మరో విడత అందజేస్తామని ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో పరిశుభ్రత కార్యక్రమాల అమలు తీరుపై సీఎం జగన్ గురువారం సమీక్ష నిర్వహించారు. జులై 26న జరగాల్సిన ఈ కార్యక్రమం వర్షాల కారణంగా వాయిదా పడింది.

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. సకాలంలో రుణాలు చెల్లించే మహిళలకు ఇప్పటివరకూ వైఎస్సార్ సున్నా వడ్డీ కింద రూ.4,696,05 కోట్లు చెల్లించాలమని చెప్పారు. పొందుపు సంఘాలకు రుణాలపై 9 శాతం వడ్డీ వర్తింపజేసేలా బ్యాంకర్ల సమావేశంలో ఒత్తిడి తెచ్చి చర్యలు చేపట్టామన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని మహిళలు ఆదాయ మార్గాలుగా మార్చుకోవాలని సూచించారు. చేయూత కార్యక్రమంలో స్వయం ఉపాధిని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని సీఎం సూచించారు.

వాస్తవానికి సున్నా వడ్డీ స్కీమ్ నిధుల్ని గత నెలలోనే విడుదల చేయాల్సి ఉంది. కానీ భారీ వర్షాల కారణంగా ఈ కార్యక్రమం వాయిదా పడింది. దీంతో మళ్లీ ఆగష్ట్ 10 ముహూర్తం ఫిక్స్ చేసినట్లు స్వయంగా ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. ఇప్పటి వరకు వైఎస్సార్ చేయూత ద్వారా సంవత్సరానికి రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో మొత్తం రూ.75 వేలు ఇవ్వనుండగా.. ఇప్పటివరకు మూడు విడతల్లో లబ్ధిదారులకు రూ.14,129.11 కోట్లు అందచేసినట్లు వెల్లడించారు.

అవసరమైన వారికి అదనంగా బ్యాంక్ రుణాలు ఇప్పించి స్వయం ఉపాధిని పెంపొందించే మార్గాలపై దృష్టిపెట్టాలని అధికారులకు సూచించారు. అంతే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల తరహాలోనే పట్టణాల్లోనూ వైఎస్సార్ డిజిటల్ లైబ్రరీల నిర్మాణానికి స్థలాను గుర్తించాలని జగన్ ఆదేశించారు.

అలాగే జగనన్న కాలనీలలో మౌలిక వసతుల కల్పనపై కూడా అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. కాలనీల్లో ఆహ్లాదంగా, పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు చేపట్టాలని.. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఇళ్ల నిర్మాణం కొనసాగుతుందని.. అ విషయంలో అధికారులు రాజీ పడొద్దని సూచించారు సీఎం జగన్.

Advertisment
Advertisment
తాజా కథనాలు