గోదావరి జిల్లాలకు రూ.12 కోట్లు అత్యవసర నిధులు రిలీజ్ చేసిన ఏపీ ప్రభుత్వం

గోదావరి జిల్లాలకు అత్యవసర సహాయక చర్యల కోసం రూ.12 కోట్ల నిధులు మంజూరు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అల్లూరి జిల్లా, కోనసీమ, ఏలూరు జిల్లాలకు 3 కోట్ల చొప్పున, పశ్చిమ గోదావరికి రూ.2 కోట్లు, తూర్పుగోదావరి కోటి రూపాయలు మొత్తం 12 కోట్లు నిధులను వైసీపీ సర్కార్...

New Update
గోదావరి జిల్లాలకు రూ.12 కోట్లు అత్యవసర నిధులు రిలీజ్ చేసిన ఏపీ ప్రభుత్వం

గోదావరిలో వరదలు పోటెత్తడంతో లంక గ్రామాల్లో కష్టాలు మొదలయ్యాయి. లంక గ్రామాలకు భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో పలు లంక గ్రామాలు జలమయమయ్యాయి. గోదావరి ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉండడంతో ఇప్పటికే లంక గ్రామాలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. రెవెన్యూ డివిజన్ పరిధిలో ప్రత్యేక కంట్రోల్ ఏర్పాటు చేశారు. అయితే వ్యవసాయ పనులు నిమిత్తం రాకపోకలు తప్పడం లేదంటున్నారు స్థానికులు.

Andhra pradesh government announce emergency floods aid godavari districts

ఈ క్రమంలో గోదావరి జిల్లాలకు అత్యవసర సహాయక చర్యల కోసం రూ.12 కోట్ల నిధులు మంజూరు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అల్లూరి జిల్లా, కోనసీమ, ఏలూరు జిల్లాలకు 3 కోట్ల చొప్పున, పశ్చిమ గోదావరికి రూ.2 కోట్లు, తూర్పుగోదావరి కోటి రూపాయలు మొత్తం 12 కోట్లు నిధులను వైసీపీ సర్కార్ మంజూరు చేసింది.

ఈ మేరకు రెవెన్యూ (డిజాస్టర్ మేనేజ్మెంట్) స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి.సాయిప్రసాద్ పేరిట జీవో విడుదలయ్యింది. అత్యవసర సహాయక కేంద్రాల ఏర్పాటుకు, ముంపు గ్రామాల నుంచి ప్రజలను తరలించేందుకు, వరద బాధితులకు ఆహారం, నీరు, పాలు అందించేందుకు, అలాగే హెల్త్ క్యాంపు నిర్వాహణతో పాటు శానిటేషన్ కోసం ఈ నిధులు మంజూరు చేసినట్లు ప్రభుత్వం తరపున ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

మరోవైపు గోదావరిలో వరద పోటెత్తడంతో లంక గ్రామాల్లో కష్టాలు మొదలయ్యాయి. రాజమండ్రి వద్ద గోదావరి వరద ఉధృతి నిలకడగా కొనసాగుతుంది. కొద్దీ గంటలుగా ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 14.3 అడుగుల వద్ద గోదావరి వరద ప్రవహం కొనసాగుతోంది. బ్యారేజీ నుండి 13 లక్షల 57 వేల క్యూసెక్కుల వరద నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. వరద సహాయక చర్యల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. గోదావరి ఏటిగట్లపై ఇరిగేషన్ సిబ్బంది విధుల్లోకి చేరారు. కోనసీమలో పొంగిపొర్లుతున్నాయి గోదావరి నదులు.. కోనసీమలోని వైనయతే, వశిష్ఠ, గౌతమి, వృద్ధగౌతమి నదులు పొంగిపొర్లుతున్నాయి. వరద ఉధృతికి కాజ్ వేలు నీటమునిగిపోవడంతో.. రాకపోకలు నిలిచిపోయాయి.

అలాగే పి.గన్నవరం మండలంలోని కనకాయలంక, అయినవిల్లి మండలంలో ఎదురు బిడియం కాజ్ వే లు పూర్తిగా నీట మునగడంతో స్థానికులు పడవలపై ప్రయాణం చేస్తున్నారు. పి గన్నవరం మండలంలో వరద ఉధృతికి కాజ్‌ వేలు నీట మునిగాయి. జీ పెదపూడి లంక బూరుగులంక అరికెలవారి పాలెం దగ్గర ప్రమాదమైన కాజ్‌ వేలను ప్రజలు దాటుతున్నారు. పీ గన్నవరం నియోజకవర్గంలో లంక గ్రామాలకు భారీగా వరద నీరు చేరుతోంది. వరద ప్రవాహానికి కాజ్ ‌వేలు నీటమునగడంతో పాటు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. ప్రమాదకర పరిస్థితుల్లో రాకపోకలు జీ పెదపూడి లంక, బూరుగులంక, అరికెల వారి పాలెం గ్రామస్తులు ప్రయాణాలు సాగిస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Ap weather Report: బంగాళాఖాతంలో అల్పపీడనం...ఏపీలో వర్షాలు..

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని, ఇది ఉత్తర దిశగా కదులుతూ బలహీనపడుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాగల 24 గంటల్లో ఉత్తర, దక్షిణ కోస్తాలో ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది

New Update
Rains

Rains

Ap Rains: నైరుతి,  పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం అక్కడే కొనసాగుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ ప్రకటించారు. 'ఇది వచ్చే 24 గంటల్లో ఉత్తర వాయువ్యదిశగా, ఆ తర్వాత ఉత్తర-ఈశాన్య దిశగా వచ్చి  24 గంటల్లో మధ్య బంగాళాఖాతంలో క్రమంగా బలహీనపడుతుంది. బుధవారం, గురువారం అకస్మాత్తుగా పిడుగులతో కూడిన వర్షాలకు అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Also Read: TTD: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. 3 రోజులు ఆర్జిత సేవలు రద్దు

శుక్రవారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి, చెట్లు క్రింద నిలబడరాదు' అని సూచించారు. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో రాగల 24 గంటల్లో చాలా చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశాలున్నట్లు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. విశాఖపట్నంలో ఉరుములతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉందని.. కోస్తాంధ్రకు ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు.

Also Read: Musk-Trump: ఆయనో మూర్ఖుడు..ట్రంప్‌ సలహాదారుడి పై మస్క్‌ సంచలన వ్యాఖ్యలు!

'అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం, ఏలూరు జిల్లా పోలవరం, వేలేరుపాడు మండలాల్లో తీవ్ర వేడిగాలులు ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. బుధవారం నాడు 25 మండలాల్లో వేడగాలులు వీస్తాయి. మంగళవారం నంద్యాల జిల్లా దొర్నిపాడు, వైఎస్సార్ కడప జిల్లా మద్దూరులో 41.5 డిగ్రీలు, కర్నూలు జిల్లా కామవరం 40.7 డిగ్రీలు, పల్నాడు జిల్లా రావిపాడులో 40.6 డిగ్రీలు, ప్రకాశం జిల్లా దరిమడుగలో 40.6 డిగ్రీలు చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. 25 ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి' అని  కూర్మనాథ్ తెలిపారు.

మరోవైపు తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.. రానున్న మూడు రోజుల వ్యవధిలో నాలుగు డిగ్రీల వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఇవాళ పలు జిల్లాల్లో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణశాఖ తెలిపింది.

Also Read:Telangana: తెలంగాణ మందుబాబులకు అదిరిపోయే వార్త.. 604 కొత్త బ్రాండ్లు!

Also Read: Bank Merger: మే 1 నుంచి ఏపీలో ఆ బ్యాంకులు కనిపించవ్.

ap-weather | AP Weather Alert | AP Weather Latest Update | ap weather news | ap weather today | ap weather updates | ap weather update today | latest-news | telugu-news | latest telugu news updates | latest-telugu-news

Advertisment
Advertisment
Advertisment