Andhra Pradesh: రేపు సమావేశమవనున్న ఏపీ కేబినెట్

గురువారం మధ్యాహ్నం 2.30 నిముషాలకు ఏపీ క్యాబినెట్ సమావేశం జరగనుంది. ఇందులో 3నెలల కోసం అసెంబ్లీ లో ప్రవేశపెట్టనున్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. దాంతోపాటూ మరికొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

New Update
Andhra Pradesh: రేపు సమావేశమవనున్న ఏపీ కేబినెట్

AP Cabinet Meeting: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఎల్లుండి ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఇందులో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. దాంతో పాటూ 3నెలల కోసం అసెంబ్లీ లో ప్రవేశపెట్టనున్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. నిన్న కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ఆంధ్రాకు బోలెడు వరాలు కురిపించారు. దీనిపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. అమరావతికి (Amaravati) మళ్లీ మంచిరోజులు వచ్చాయనే ఆశ అందరిలో చిగురించిందన్నారు. ఇప్పటికే రాజధాని నిర్మాణం జరిగుంటే మరో మూడు లక్షల కోట్ల రూపాయల ప్రజా సంపద కూడా వచ్చి ఉండేదని చెప్పారు. గత పాలకుల వల్ల అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇక ఏపీ జీవనాడి పోలవరం 72శాతం పూర్తయింది. పోలవరాన్ని సాధ్యమైనంత తొందరలోనే పూర్తి చేస్తామని బడ్జెట్‌లో (Union Budget 2024) ఆర్థిక మంత్రి నిర్ధిష్టమైన హామీ ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ఆమెకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. 2020-21 నాటికి పూర్తి కావాల్సిన పోలవరం ప్రాజెక్టును గోదావరిలో కలిపేశారని, కావాలని కాంట్రాక్టర్లను, అధికారులను మారుస్తూ అంతా పాడు చేశారంటూ మండిపడ్డారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, రైతులకు జీవనాడి పోలవరం. భారత ఆహార భద్రతకు ఆ ప్రాజెక్టు ఎంతో కీలకం. పోలవరం నిర్మాణం (Polavaram Project) వెంటనే జరిగేలా చర్యలు తీసుకుంటామని నిర్మల సీతారామన్ (Nirmala Sitharaman) భరోసానిచ్చారు. అలాగే ఏపీలో వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వనున్నట్లు తెలిపారు. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు మంజూరు చేస్తామన్నారు. విభజన చట్టం ప్రకారం పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేక సహకారం అందిస్తామని, విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌లోని నోడ్‌లకు ప్రత్యేక సాయం చేస్తామన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి. కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాలకు నీళ్లు, విద్యుత్‌, రోడ్లు, హైవేల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామన్నారు. విశాఖ – చెన్నై కారిడార్‌లో కొప్పర్తికి, హైదరాబాద్‌-బెంగళూరు కారిడార్‌లో ఓర్వకల్లుకు నిధులు ఇస్తామని స్పష్టం చేశారు.

Also Read:Budget 2024: తగ్గనున్న బ్యాటరీ, ఎలక్ట్రిక్ వాహనాల ధరలు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Vontimitta Temple : ప్రతి భక్తుడికి ముత్యపు తలంబ్రాలు, అన్నప్రసాదాలు.

శ్రీరామ నవమి ఉత్సవాలకు ఒంటిమిట్ట ఆలయంలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏప్రిల్ 11న జరుగనున్న శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి విచ్చేసే ప్రతి భక్తుడికి ముత్యపు తలంబ్రాలు, అన్నప్రసాదాలు అందించేలా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు టీటీడీ అధికారులు సమీక్ష చేసారు.

New Update
Vontimitta Temple

Vontimitta Temple

Vontimitta Temple : శ్రీరామనవమి వేడుకులకు దేశమంతా సిద్ధమైంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే తెలంగాణలో భద్రాచలం, ఆంధ్రప్రదేశ్‌లో ఒంటిమిట్ట దేవాలయాల్లో స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరగనుంది. కాగా శ్రీరామనవమి వేడుకలకు రెండు రాష్ట్రాలు ఘనంగా ఏర్పాట్లుచేస్తున్నాయి. శ్రీరామ నవమి ఉత్సవాలకు ఒంటిమిట్ట ఆలయంలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రతీ ఏటా ఈ ఆలయంలో వైభవంగా వేడుకలు నిర్వహిస్తారు. ఒంటిమిట్ట ఏకశిలానగరంలో ఏప్రిల్ 11న జరుగనున్న శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి విచ్చేసే ప్రతి భక్తుడికి ముత్యపు తలంబ్రాలు, అన్నప్రసాదాలు అందించేలా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ముందస్తు ఏర్పాట్ల పైన టీటీడీ అధికారులు సమీక్ష చేసారు. అధికారులకు పలు సూచనలు ఇవ్వటంతో పాటుగా చేపట్టా ల్సిన చర్యల పైన దిశా నిర్దేశం చేసారు. 

ఇది కూడా చదవండి: వేయించిన ఆహారాలతో క్యాన్సర్‌ ముప్పు

క్షేత్ర స్థాయిలో అధికారులు పటిష్ట ప్రణాళికలు ఏర్పాటు చేసుకుని అమలు చేసేలా కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. కల్యాణ వేదిక ప్రాంగణం వద్ద ఉన్న 120 గ్యాలరీల లో ఉండే భక్తులతో పాటు, కల్యాణం వీక్షించేందుకు వచ్చిన భక్తులందరూ శ్రీ సీతారాముల కల్యాణోత్సవాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కల్యాణ వేదిక ప్రవేశ ప్రారంభంలో తలంబ్రాలు పంపిణీ కోసం 16 కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. భారీగా రానున్న భక్తులు శ్రీ సీతారాముల కల్యాణోత్సవం తిలకించేలా 15 ఎల్ ఈడీ స్క్రీన్ లు, ఆలయం , కల్యాణ వేదిక, తదితర ప్రాంతాల్లో విద్యుత్ కాంతులతో 38 దేవతామూర్తుల విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులు సులువుగా గుర్తించేదెలా సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. 

ఇది కూడా చదవండి: లంగ్స్‌ బేషుగ్గా ఉండాలంటే తులసి ఆకులు నమలండి

విజిలెన్స్ శాఖ ఆధ్వర్యంలో 100 సిసి కెమెరాలు, 3 డ్రోన్ లు, 3 కంట్రోల్ రూమ్ లు, దాదాపు 2400 మంది భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్స వాలకు దాదాపు 3 లక్షల తాగునీరు బాటిల్స్, 250 మంది పారామెడికల్ సిబ్బంది, 35 మంది వైద్య నిపుణులు, 13 మెడికల్ టీంలు, 8 అంబులెన్స్ లు, అగ్నిమాపక సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 

ఇది కూడా చదవండి: పప్పు ధాన్యాలు తినడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు తప్పవా?

 హెచ్ డి పీపీ - (18), దాస సాహిత్య ప్రాజెక్టు - (4,) అన్నమాచార్య ప్రాజెక్టు- (8) ఆధ్వర్యంలో మొత్తం 30 కళాబృందాలతో సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మొదటిసారి కళాకృతులుతో సంక్షిప్త రామాయణాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు, కల్యాణ వేదిక, ఆలయం, పరిసర ప్రాంతాల్లో 12 టన్నుల సాంప్రదాయ పుష్పాలు, లక్ష కట్ ఫ్లవర్స్ తో పుష్పాలంకరణలు చేస్తున్నట్లు తెలిపారు. కల్యాణోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కానున్నారు. ఒంటిమిట్టలో జరిగే ఈ కల్యాణోత్సవం తిలకించటానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రానున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి.

Also read :  నీ అభిమానం సల్లగుండా.. పవన్ కోసం రక్తం చిందించిన అభిమాని.. ఏం చేశాడంటే?

Advertisment
Advertisment
Advertisment