/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-22T162119.270.jpg)
Anchor Shyamala Clarity On Rave Party : బెంగళూరు రేవ్ పార్టీ (Bangalore Rave Party) టాలీవుడ్ (Tollywood) లో ఎంతటి కలకలం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ రేవ్ పార్టీలో సినీ ప్రముఖుల పేర్లు బయటికి రావడం చర్చనీయాంశంగా మారింది. ఈ లిస్ట్ లో మొదట నటి హేమ పేరు బయటికొచ్చింది. బెంగుళూరు పోలీసులు కూడా హేమ రేవ్ పార్టీలో ఉందని కన్ఫర్మ్ చేశారు.
కానీ హేమ మాత్రం పార్టీలో తాను పాల్గొనలేదని చెప్తోంది. కాగా ఇదే విషయమై తేజగా RTV ప్రతినిధితో ఫోన్‌లో మాట్లాడిన హేమ.. తనపై వెదవలు తప్పుడు ప్రచారం చేస్తున్నాని చెప్పింది. ఆ తరువాత వెధవలు అన్న కామెంట్‌పై క్లారిటీ ఇస్తూ.. తాను ఆ మాట మీడియానుద్దేశించి అనలేదని వివరణ ఇచ్చింది.
Also Read : రెండు రోజుల్లో అందరి సంగతి తేలుస్తా.. రేవ్ పార్టీ పై హేమ సంచలన ఆడియో!
మరోవైపు హేమ తర్వాత ఇదే రేవ్ పార్టీలో పాల్గొన్నారంటూ వస్తున్న ఆరోపణలపై యాంకర్ శ్యామల క్లారిటీ ఇస్తూ ఓ వీడియో రిలీజ్ చేసింది. ఆ వీడియోలో శ్యామలా (Anchor Shyamala) మాట్లాడుతూ.. " బెంగుళూరు రేవ్ పార్టీ ఎక్కడ జరిగిందో, ఎప్పుడు జరిగిందో నాకు తెలీదు. కానీ అందులో నేను కూడా ఉన్నానంటూ ఓ ఛానల్ నాపై దుష్ప్రచారం చేస్తున్నారు.
ఓ పార్టీకి నేను సపోర్ట్ చేస్తున్నానని తెలిసి మా పార్టీ మీద, మా మీద బురద జల్లే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు చేసే ఈ ప్రచారాన్ని ఎంతమాత్రం ఊరుకునే పరిస్థితి లేదు. వాళ్ళ మీద న్యాయపరమైన యాక్షన్ తీసుకోవడం జరిగింది. దయచేసి ఇలాంటి అసత్య ప్రచారాలు చేసి జర్నలిజం విలువలు తగ్గించొద్దు.." అంటూ తెలిపింది.