/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-3-10.jpg)
Americans Response On Trump's Attack: రెండు రోజుల క్రితం అమెరికన్ రిపబ్లికన్ నేత, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పై కాల్పుల దాడి జరగడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ట్రంప్ తృటిలో తప్పించుకోగలిగారు. ట్రంప్ మీద కాల్పులు చేసిన షూటర్‌ను భద్రతా సిబ్బంది కాల్చి చంపారు. అలాగే ఈ ఘటనలో ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన ట్రంప్ మద్ధతుదారుడు ఒకరు మృతిచెందారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వార్త ప్రపంచవ్యాప్తంగా క్షణాల్లోనే వ్యాపించింది. ట్రంప్‌పై దాడి జరిగిన మూడు గంటల్లోపే చైనా మార్కెట్లలో ట్రంప్ టీషర్టులు వచ్చేశాయి. దాడి జరిగిన తర్వాత ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో టీ షర్టులపై ముద్రించారు. ఐ విల్ నెవర్ స్టాప్, ఫైట్ ఫర్ అమెరికా, షూటింగ్ మేక్స్ మీ స్ట్రాంగర్ అంటూ ట్రంప్ అన్న ఈ వ్యాఖ్యలను టీషర్టులపై ముద్రించారు. మరోవైపు ట్రంప్‌పై దాడి జరిగిన తర్వాత ప్రజల్లో ఆయనకు మరింత మద్దతు పెరిగినట్లు పోలస్ స్టర్ తాజా నివేదికలో తెలిపింది. ఈ ఘటన తర్వాత ప్రజల నుంచి ట్రంప్‌నకు 8 శాతం మద్ధతు పెరిగినట్లు నివేదిక వెల్లడించింది.
మరోవైపు ట్రంప్ మీద జరిగిన దాడిపై అమెరికన్లు స్పందిస్తున్నారు. ఇలాంటి దాడులను అస్సలు సపోర్ట్ చేయమని చెబుతున్నారు. వయెలెన్స్‌ను సమర్ధించేదే లేదని చెబుతున్నారు. దాడి జరిగింది ఎవరి మీద అన్నది ముఖ్యం కాదని..ఆ ప్లేస్‌లో ట్రంప్ ఉన్నా, సామాన్య ప్రజలు ఉన్నా కూడా అది తప్పేనని అంటున్నారు. అలాగే ఈ కాల్పులు పొలికల్ స్టంట్ కాదని కూడా అంటున్నారు. ట్రంప్ కానీ, బైడెన్‌కు కానీ ఈ కాల్పులతో సంబంధం ఉండకపోవచ్చని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటన తర్వాత ట్రంప్ మీద సానుభూతి ఏర్పడవచ్చని కొంతమంది అంటుంటే..మరి కొంత మంది మాత్రం అలాంటిదేమీ ఉండదని చెబుతున్నారు. ట్రంప్ గెలవడానికి ఈ కాల్పులు ఎలాంటి సహాయం చేయలేవని అన్నారు. ట్రంప్, బైడెన్‌లలో ఎవరు గెలుస్తారనేది చెప్పడం కష్టమని అభిప్రాయం వ్యక్తం చేశారు.
Also Read:Madhya Pradesh: చదువెందుకు..పంక్చర్లు వేసుకుని బతకండి..బీజేపీ ఎమ్మెల్యే సలహా