US: వామ్మో ఇదేం గాలిరా బాబు...ఏకంగా విమానాన్నే..!

అమెరికాలోని టెక్సాస్, ఓక్లహామా, ఆర్కన్సాస్‌లను శక్తిమంతమైన టోర్నడోలు అతలాకుతలం చేశాయి. డల్లాస్‌ ఫోర్ట్‌ వర్త్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో ఓ బోయింగ్‌ 737-800 విమానం పార్కింగ్‌లో నిలిపి ఉంది. అయితే భారీగా వీచిన గాలి దెబ్బకు ఒక్కసారిగా గిరిగిర తిరిగింది.ఈ వీడియో ఈ కథనంలో..

New Update
Flights Cancelled: దేశ వ్యాప్తంగా 200 విమానాలు రద్దు..ఎందుకో తెలుసా!

US: సాధారణంగా వాయుగుండాలు పడినప్పుడు, తుపాన్‌ లు బీభత్సం సృష్టించినప్పుడు గాలులు ఎంతటి విధ్వంసాలను సృష్టిస్తాయో మనకు తెలిసిన విషయమే. అలా గాలులు వీస్తున్న సమయంలో వస్తువులు ఎగిరిపోవడం, చెట్లు విరిగిపడిపోవడం లాంటి దృశ్యాలను చూస్తూనే ఉంటాం. కానీ ఈదురు గాలు లు వల్ల ఏకంగా ఓ బోయింగ్‌ విమానామే గిరగిరా తిరిగిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.

అమెరికాలోని టెక్సాస్, ఓక్లహామా, ఆర్కన్సాస్‌లను శక్తిమంతమైన టోర్నడోలు అతలాకుతలం చేశాయి. డల్లాస్‌ ఫోర్ట్‌ వర్త్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో ఓ బోయింగ్‌ 737-800 విమానం పార్కింగ్‌లో నిలిపి ఉంది. అయితే భారీగా వీచిన గాలి దెబ్బకు ఒక్కసారిగా గిరిగిర తిరిగిపోయింది. ఆ సమయంలో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. విమానాశ్రయంలో ఉన్న సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డ్‌ అయ్యాయి.

మంగళవారం ఉదయం ఎయిర్‌పోర్టులో గేట్‌ సీ21 దగ్గర ఈ ఘటన చోటుచేసుకొంది. ఆ సమయంలో దాదాపు గంటకు 80 మైళ్ల వేగంతో గాలులు వీచాయి. ఈ దెబ్బకు అధికారులు సుమారు 202 విమానాలను రద్దు చేసింది. మరో 500 విమాన సర్వీసుల్లో తీవ్ర జాప్యం నెలకొంది.

Also read:  తెరుచుకున్న పాఠశాలలు.. ఎండకు సొమ్మసిల్లిపోయిన విద్యార్థులు

Advertisment
Advertisment
తాజా కథనాలు