Amazon: అమెజాన్‌ నుంచి వందల ఉద్యోగులు ఔట్‌!

అమెజాన్ వెబ్ సర్వీసెస్ నుంచి వందలాది మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలిపింది. ఈ లేఆఫ్స్‌ లో సేల్స్, మార్కెటింగ్, టెక్ రోల్స్‌లోని ఉద్యోగులు ఇంటికి వెళ్లనున్నారు.ఉద్యోగాలు కోల్పోయిన వారిలో AWS సేల్స్, మార్కెటింగ్, గ్లోబల్ సర్వీసెస్ డివిజన్‌, సిబ్బంది ఉన్నట్లు కంపెనీ తెలిపింది.

New Update
Amazon: అమెజాన్‌ నుంచి వందల ఉద్యోగులు ఔట్‌!

Amazon Layoffs: కరోనా మహమ్మారి దేశాన్ని విడిచిపోయినప్పటికీ.. ఆర్థిక మాంద్యం భయం మాత్రం టెక్ సంస్థల్ని కలవరపెడుతుంది. రెండు సంవత్సరాల నుంచి పేరు మోసిన ఐటీ కంపెనీలన్ని తమ సంస్థల ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు తమ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా కంపెనీలు లేఆఫ్స్ ప్రకటిస్తూనే ఉన్నాయి.

ఇందులో గూగుల్, అమెజాన్, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీలు ఉన్నాయి. ఆదాయం తగ్గడంతో ఖర్చలని తగ్గించుకునేందుకు ఉద్యోగులను తొలగిస్తున్నట్లు కంపెనీలు వివరించాయి. తాజాగా అమెజాన్ వెబ్ సర్వీసెస్(AWS) నుంచి వందలాది మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలిపింది. ఈ లేఆఫ్స్‌ లో సేల్స్, మార్కెటింగ్, టెక్ రోల్స్‌లోని ఉద్యోగులు ఇంటికి వెళ్లనున్నారు. ఉద్యోగాలు కోల్పోయిన వారిలో AWS సేల్స్, మార్కెటింగ్, గ్లోబల్ సర్వీసెస్ డివిజన్‌, ఫిజికల్ స్టోర్స్ టెక్నాలజీ టీమ్‌లో వందలాది ఉద్యోగులు ఉన్నారని అమెజాన్ క్లౌడ్ కంప్యూటింగ్ విభాగం తెలిపింది.

అమెజాన్ ఇప్పటికే ప్రైమ్ వీడియో సర్వీస్, హెల్త్ కేర్ బిజినెస్, అలెక్సా వాయిస్ అసిస్టెంట్ యూనిట్‌తో సహా పలు విభాగాల్లో వందలాది మంది సిబ్బందిని తొలగించింది. లేఆఫ్ ట్రాకింగ్ వెబ్‌సైట్ Layoffs.fyi ప్రకారం, ఇప్పటివరకు 229 సంస్థలలో 57,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించినట్లు కంపెనీలు తెలిపాయి.

Also read: నోరు పొడిబారడం.. దాహంగా అనిపించడం… ఇవన్నీ వేడికి మాత్రమే కాదు… వీటికి కూడా కారణాలు కావొచ్చు!

Advertisment
Advertisment
తాజా కథనాలు