Amazon Great Freedom Festival Sale: ఆ వస్తువులు కేవలం రూ.49 మాత్రమే.. అమెజాన్ ఫ్రీడం సేల్ లో పిచ్చెక్కించే ఆఫర్లు! ఈ నెల 6 నుంచి గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్ సేల్ ను నిర్వహించనున్నట్లు ప్రకటించింది అమెజాన్. ఈ సేల్ లో ఏకంగా 80 శాతం వరకు డిస్కౌంట్ తో వివిధ వస్తువులను కొనుగోలు చేయవచ్చు. ఇంకా కేవలం రూ.49 ప్రారంభ ధరతోనే అనేక ప్రొడక్ట్స్ అందుబాటులో ఉంటాయని అమెజాన్ తన సేల్ పేజీలో పేర్కొంది. By Nikhil 02 Aug 2024 in బిజినెస్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి Amazon Sale: ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ మరో సారి భారీ సేల్ ను ప్రకటించింది. ప్రతీ ఏడాది మాదిరిగానే ఈ ఆగస్టులోనూ గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్ సేల్ ను నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ నెల 6 నుంచి.. అంటే మరో 4 రోజుల్లో ఈ సేల్ ప్రారంభించనుంది అమెజాన్. ఏడాదికి ఓ సారి జరిగే ఈ మెగా సేల్ కోసం వినియోగదారులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సారి కూడా భారీ ఆఫర్లు ఉంటాయని అమెజాన్ తన సేల్ పేజీలో పేర్కొంది. ఆఫర్లతో పాటు SBI కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా మరో 10 శాతం డిస్కౌంట్ అందుకోవచ్చని అమెజాన్ ప్రకటించింది. ఈ సేల్ లో అన్ని రకాల ఎలక్ట్రానిక్ పరికరాలు, హోం అప్లియెన్సెస్, ఫ్యాషన్, బ్యూటీ తదితర వస్తువులపై బారీ ఆఫర్లు ఉండనున్నాయని అమెజాన్ (Amazon) తన సేల్ పేజీలో తెలిపింది. మీరు స్మార్ట్ వాచ్ లను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తూ ఉంటే ఈ సేల్ మీకు బెస్ట్ ఛాన్స్ అని చెప్పొచ్చు. కేవలం రూ.999కే ఈ సేల్ లో స్మార్ట్ వాచ్ ను సొంతం చేసుకోవచ్చు.హోమ్, కిచెన్ అప్లియెన్సెస్ కేవలం రూ.79 ప్రారంభ ధరతో సొంతం చేసుకోవచ్చు. ట్రావెల్ బుకింగ్స్ ను సైతం 40 శాతం వరకు డిస్కౌంట్ తో చేసుకోవచ్చు. బుక్స్, టాయ్స్, గేమింగ్ వస్తువులను సైతం 49 రూపాయల ప్రారంభ ధరతో సొంతం చేసుకోవచ్చు. దస్తులు, ఫుట్ వేర్, బ్యూటీ వస్తువులపై సైతం ఎప్పుడూ లేనంతగా ఈ సేల్ లో ఆఫర్లు ఉంటాయని అమెజాన్ తెలిపింది. స్మార్ట్ టీవీలపై ఈ సేల్ లో సూపర్ ఆఫర్లు ఉండనున్నాయని సేల్స్ పేజీని పరిశీలిస్తే స్పష్టం అవుతోంది. కేవలం రూ.6999 ప్రారంభ ధరతోనే స్మార్ట్ టీవీని సొంతం చేసుకోవచ్చు. Also Read: ఫాస్టాగ్ న్యూ రూల్స్ అమలులోకి.. మీ కారు కోసం ఏమి చేయాలి? తెలుసుకోండి! #amazon #amazon-sale #amazon-deals మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి