Pushpa 2: ఆ భాషలో కూడా విడుదల అవుతున్న పుష్ప 2!

పుష్ప 2ను బంగ్లాలో కూడా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇటీవల ప్రకటించారు. బంగ్లాదేశ్‌లో విడుదలవుతున్న మొట్టమొదటి తెలుగు చిత్రంగా పుష్ప 2 అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది. పుష్ప 2 గురించి మరో న్యూస్ కూడా నెట్టింట వైరల్ అవుతోంది. బెంగాలీ భాషలో కూడా ఈ సినిమా రిలీజ్ కానుందంట.

New Update
Pushpa 2: ఆ భాషలో కూడా విడుదల అవుతున్న పుష్ప 2!

Allu Arjun Pushpa 2 - The Rule: ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ , మాస్టర్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ (Sukumar)  డైరెక్షన్‌ లో రూపుదిద్దుకుంటున్న సినిమా పుష్ప 2. ది రూల్‌...ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో టాలీవుడ్‌ ముద్దుగుమ్మ రష్మిక (Rashmika Mandanna) శ్రీవల్లి పాత్రలో చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో ఫహద్ ఫాసిల్, అనసూయ భరద్వాజ్, సునీల్, జగదీష్, బ్రహ్మాజీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పుష్ప 2 ఆగస్ట్ 15న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా విడుదలైన టీజర్.. సోషల్ మీడియాను ఓ ఊపు ఊపిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పాన్‌ ఇండియా లెవల్లో ఆగస్‌ 15న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. పుష్ప 2ను బంగ్లాలో కూడా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇటీవల ప్రకటించారు. బంగ్లాదేశ్‌లో విడుదలవుతున్న మొట్టమొదటి తెలుగు చిత్రంగా పుష్ప 2 అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది. పుష్ప 2 గురించి మరో న్యూస్ కూడా నెట్టింట వైరల్ అవుతోంది. బెంగాలీ భాషలో కూడా ఈ సినిమా రిలీజ్ కానుందంట.అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

పుష్ప 2 సినిమా నుంచి మ‌రో క్రేజీ అప్‌డేట్ అందింది. అభిమానుల్లో మరింత జోష్ నింపేందుకు మరో టీజర్ విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోన్న‌ట్లు స‌మ‌చారం. ఈ న్యూస్ విన్న బ‌న్నీ అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.

Also read: కూలిన హెలికాప్టర్‌…మిలిటరీ చీఫ్‌ దుర్మరణం!

Advertisment
Advertisment
తాజా కథనాలు