Pawan Kalyan : అల్లు అర్జున్ Vs పవన్ కళ్యాణ్.. 'పుష్ప 2' కు పోటీగా వీరమల్లు?

అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ మధ్య బాక్సాఫీస్ వార్ జరగబోతుంది. 'పుష్ప2' కి పోటీగా డిసెంబర్ 6న హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అవుతుందనే ప్రచారం నడుస్తోంది. ఒకవేళ అదే జరిగితే టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రెండు పెద్ద సినిమాల మధ్య బిగ్ ఫైట్ ఉంటుందని చెప్పొచ్చు.

New Update
Pawan Kalyan : అల్లు అర్జున్ Vs పవన్ కళ్యాణ్.. 'పుష్ప 2' కు పోటీగా వీరమల్లు?

Allu Arjun Vs Pawan Kalyan : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'పుష్ప 2' (Pushpa 2) డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 6 న సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. సరిగ్గా ఇదే సమయానికి టాలీవుడ్ నుంచి మరో బడా మూవీ రిలీజ్ కు రెడీ అవుతున్నట్టు తాజా సమాచారం బయటికొచ్చింది. ఆ బడా మూవీ మరేదో కాదు పవర్ స్టార్ నటిస్తున్న 'హరిహర వీరమల్లు' (Hari Hara Veera Mallu). ఈ ఇయర్ ఎండింగ్ లో అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ మధ్య బిగ్ ఫైట్ జరగనున్నట్లు తెలుస్తోంది.

డిసెంబర్ లో వీరమల్లు...

నిర్మాత ఏఎం రత్నం ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా డిసెంబర్ లో రిలీజ్ చేస్తామని నిర్మాత స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ 20-25 రోజుల కాల్ షీట్స్ ఇస్తే షూటింగ్ కంప్లీట్ అయిపోతుందని తెలిపారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని అన్నారు. అమెజాన్ ప్రైమ్ తో డిజిటల్ రైట్స్ కోసం జరిగిన ఒప్పందంలో అక్టోబర్ రిలీజ్ అని చెప్పామని, అయితే డిసెంబర్ వరకు గడువు అడుగుతామని అన్నారు.

Also Read : రాజమౌళి,మహేష్ బాబు మూవీ విలన్ గా మలయాళ నటుడు!

దీన్ని బట్టి 'హరిహర వీరమల్లు' ఆల్ మోస్ట్ డిసెంబర్ లో రావడం ఖాయంగా కనిపిస్తోంది. 'పుష్ప2' కి పోటీగా డిసెంబర్ 6న ఈ సినిమా రిలీజ్ అవుతుందనే ప్రచారం నడుస్తోంది. ఒకవేళ అదే జరిగితే టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రెండు పెద్ద సినిమాల మధ్య బిగ్ ఫైట్ ఉంటుందని చెప్పొచ్చు. త్వరలోనే దీనిపై పూర్తి స్పష్టత రానుంది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam Terror Attack: ఉగ్రదాడిలో 28 మంది మృతి.. తనికెళ్ల భరణి కన్నీటి కవిత

పహల్గాం టెర్రరిస్టు అటాక్‌పై సినీ నటుడు తనికెళ్ల భరణి స్పందించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక కన్నీటి కవితను షేర్ చేసారు. కాశ్మీరంలోనే కుంకం పువ్వెందుకు పూస్తుందో నా కర్ధమైపోయింది! అంటూ ఆ కవిత సాగుతుంది. ప్రస్తుతం అది నెట్టింట వైరల్‌గా మారింది.

New Update
Pahalgam Terror Attack

Pahalgam Terror Attack

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అందమైన ప్రదేశాలను చూసేందుకు వచ్చిన టూరిస్టులపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో దాదాపు 28 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ముస్లిమేతరులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు పాల్పడినట్లు సాక్ష్యులు చెబుతున్నారు. 

ఇది కూడా చూడండి: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ

అమాయక ప్రజల మృతిపై ఇప్పటికే సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు, వ్యాపార వేత్తలు సంతాపం తెలిపారు. ఈ చర్యలకు పాల్పడిన వారిని అస్సలు వదలకూడదని.. కఠినంగా శిక్షించాలంటూ భారతీయులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ సీనియర్ యాక్టర్ తనికెళ్ల భరణి స్పందించారు. ఈ మేరకు ఒక కవితతో ఉన్న పోస్టర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

ఇది కూడా చూడండి: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

కన్నీటి కవిత

కాశ్మీరంలోనే కుంకం పువ్వెందుకు పూస్తుందో నా కర్ధమైపోయింది!
అక్కడ ఉన్నట్టుండి పాకే పాకే పసిబిడ్డ నెత్తురు ముద్దై పోతుంది. 

సామగానం చేసే కాశ్మీరీ పండితుల కంఠాల్లోంచి వేదం ఆగి- రుధిరం బైటికొస్తుంది.

అక్కడ రేపు పల్లకీ లెక్కి ఊరేగాల్సిన పెళ్ళికొడుకులు ఇవాళే పాడెక్కుతారు...

ఆ లోయలో హిమాలయాలు సైతం మూర్తీభవించిన వైధవ్యాల్లా ఉంటాయ్

భరతమాత కిరీటం వొరుసుకునీ నిరంతరం అక్కడ నెత్తురోడుతూ ఉంటుంది !

బుద్ధుడు కూడా కళ్ళూ నోరూ మూసుకుని మళ్ళీ అంతర్ముఖుడౌతాడు !!

ఎప్పుడో 40 ఏళ్ళ క్రితం రాసిన కవిత, ఇంకా తడిగానే ఉంది!! అంటూ తనికెళ్ల భరణి ఒక కవితను పంచుకున్నారు. ఇప్పుడది నెట్టింట వైరల్‌గా మారింది. 

 

pahalgam | Pahalgam attack | pahalgam breaking news | tanikella-bharani | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment