Airindia: విమాన భోజనంలో ఇనుపముక్క.. కంగుతిన్న ప్రయాణికుడు ఎయిరిండియా విమానంలో ప్యాసింజర్‌కి ఇచ్చిన భోజనంలో బ్లేడు ముక్క కనిపించింది. దీనిపై ప్రయాణికుడు ఫిర్యాదు చేయగా.. కూరగాయలు కట్ చేసేందుకు వాడే ప్రాసెసింగ్ మెషీన్ నుంచి ఒక ఇనుప బ్లేడ్ ముక్క వచ్చిందని సంస్థ తెలిపింది. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పింది. By B Aravind 17 Jun 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి టాటా గ్రూప్‌నకు చెందిన ఎయిరిండియా విమానంలో ప్యాసింజర్‌కి ఇచ్చిన భోజనంలో బ్లేడు ముక్క కనిపించింది. ఇదిచూసి కంగుతిన్న ప్రయాణికుడు అనంతరం అధికారులకు ఫిర్యాదు చేశాడు. బెంగళూరు నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు వెళ్లే విమానంలో ఈ సంఘటన జరిగింది. గతవారం ఎయిరిండియా ఏఐ 175 విమానంలో తనకు ఎదురైన అనుభవాన్ని ఆ ప్యాసింజర్ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీనిపై ఎయిరిండియా చీఫ్ కస్టమర్ ఎక్‌పీరియన్స్ అధికారి స్పందించారు. మా ఫ్లైట్‌లో జర్నీ చేసిన ఓ ప్రయాణికుడి భోజనంలో మెటల్ వస్తువు ఉన్నట్లు గుర్తించామని అన్నారు. Also Read: భారత్‌లో ప్రకంపనలు రేపుతున్న ఈవీఎం హ్యాకింగ్.. దీనిపై విచారణ చేయగా.. కూరగాయలు కట్ చేసేందుకు వాడే ప్రాసెసింగ్ మెషీన్ నుంచి ఒక ఇనుప బ్లేడ్ ముక్క వచ్చిందని తెలిసినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై ప్రయాణికుడికి క్షమాపణలు చెబుతున్నామని, మళ్లీ ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇదిలాఉండగా.. ఇటీవల ఓ ప్రయాణికుడు కూడా ఎయిరిండియా విమానాల్లో భోజనాలకు సంబంధించి ఫిర్యాదు చేశాడు. విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు తనకు సరిగా ఉడకని భోజనాన్ని ఇచ్చారని.. సీటు కూడా సరిగా లేదని ఫిర్యాదు చేశాడు. Also Read: పెరిగిన పెట్రోల్ ధరలకు నిరసన చేస్తూ గుండెపోటుతో బీజేపీ నేత మృతి #telugu-news #national-news #air-india #air-india-flight మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి