Watch Video : స్కూల్‌కు ఆలస్యంగా వచ్చిన టీచర్‌.. ప్రిన్సిపాల్ దాడి

ఉత్తప్రదేశ్‌లోని ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. పాఠశాలకు ఆలస్యంగా వచ్చిందనే కారణంతో ఓ టీచర్‌పై ప్రధానోపాధ్యాయురాలు చేయి చేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.

New Update
Watch Video : స్కూల్‌కు ఆలస్యంగా వచ్చిన టీచర్‌.. ప్రిన్సిపాల్ దాడి

Uttar Pradesh : ఉత్తప్రదేశ్‌లోని ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. పాఠశాలకు(School) ఆలస్యంగా వచ్చిందనే(Coming Late) కారణంతో ఓ టీచర్‌(Teacher) పై ప్రధానోపాధ్యాయురాలు చేయిచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఆగ్రాలోని సీగానా గ్రామంలో గుంజన్ చౌదరి అనే మహిళ.. ప్రీ సెకండరీ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తోంది. అయితే ఆమె స్కూల్‌ ఆలస్యంగా వచ్చిందనే కారణంతో ఆ పాఠశాల లేడీ ప్రిన్సిపాల్ ఆమెపై దాడికి దిగింది. అక్కడే ఉన్న తోటి టీచర్లు వీళ్లను అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.

Also Read: ప్రజ్వల్‌ రేవన్న ఇంటికి సిట్ అధికారులు.. రెండోసారి లుక్ఔట్ నోటీసులు

ఈ గొడవలో ఆ టీచర్ గాయపడినట్లు తెలుస్తోంది. ఈ గొడవను వీడియో తీసి సోషల్ మీడియా(Social Media) లో పోస్టు చేయడంతో ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది. ఇదిలాఉండగా ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని లేడీ ప్రిన్సిపాల్ పాఠశాలలో ఫేషియల్ చేయించుకున్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరలైంది. ఇది గమనించి ఆమె వీడియో తీసిన టీచర్ చేయి కొరికింది ఆ ప్రిన్సిపాల్. ఈ ఘటన మరవకముందే ఇలాంటిది చోటుచేసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.


Also Read: భార్యతో అసహజ శృంగారం నేరం కాదు : హైకోర్టు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING : జీరో లైన్ దాటిన భారత జవాన్.. బంధించిన పాక్ ఆర్మీ!

ఫిరోజ్‌పూర్‌లోని భారత్-పాకిస్తాన్ సరిహద్దు వద్ద BSF జవాన్ ను పాక్ సైన్యం బంధించింది. తమ భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించాడని ఆరోపిస్తూ అరెస్టు చేశామని చెబుతోంది. అయితే ఈ ఆరోపణలను BSF ఖండించింది.

New Update
pak-army

pak-army

పహల్గాం ఉగ్రదాడి మధ్య పంజాబ్ నుంచి బిగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది.  ఫిరోజ్‌పూర్‌లోని భారత్-పాకిస్తాన్ సరిహద్దు వద్ద BSF జవాన్ ను పాక్ సైన్యం బంధించింది. తమ భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించాడని ఆరోపిస్తూ అరెస్టు చేశామని పాక్ ఆర్మీ  చెబుతోంది. అయితే ఈ ఆరోపణలను BSF ఖండించింది. జవాను అనుకోకుండా జీరో లైన్ దాటాడని..  తప్పుడు ఆరోపణలతో జవాన్ ను  అదుపులోకి తీసుకుందని ఇండియన్ ఆర్మీ చెబుతోంది.  

రైతులు పంట కోస్తున్న ప్రదేశంలో ఆ సైనికుడు వారిని గమనిస్తున్నాడని తెలిపింది.. రెండు దేశాల సరిహద్దులు కలిసే సరిహద్దు భాగాన్ని జీరో లైన్ అంటారు.  ఈ ప్రదేశంలో వ్యవసాయం చేయడానికి రైతులకు ప్రత్యేక అనుమతి లభిస్తుంది. రైతులు పంటలు కోసేటప్పుడు వారి భద్రత కోసం BSF సైనికులు వారితో ఉంటారు. వారిని రైతు రక్షకులు అని కూడా అంటారు.

జీరో లైన్ కు చాలా ముందుగానే ముళ్ల తీగను ఏర్పాటు చేస్తారు. జీరో లైన్ పై స్తంభాలను మాత్రమే ఏర్పాటు చేస్తారు.అక్కడ వేడి తీవ్రంగా ఉండటంతో సైనికుడు జీరో లైన్ దాటి పాకిస్తాన్ సరిహద్దుకు వెళ్లి ఒక చెట్టు నీడ కింద కూర్చున్నాడు.  ఇంతలో పాకిస్తానీ రేంజర్లు అతన్ని చూసి అదుపులోకి తీసుకుని వెంటనే అతని ఆయుధాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత, భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ద వాతావరణం నెలకొంది.  

Advertisment
Advertisment
Advertisment