Rohit Sharma : విరాట్ బాటలోనే రోహిత్.. టీ20లకు రిటైర్మెంట్

భారత హిట్ మ్యాన్ టీ 20 వరల్డ్‌కప్‌ విజయం తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రపంచకప్‌ విజయానికి భారత సేనను నడిపించిన రోహిత్ ఇక తాను టీ 20 లను ఆడనని అనౌన్స్ చేశాడు.

New Update
Rohit Sharma : విరాట్ బాటలోనే రోహిత్.. టీ20లకు రిటైర్మెంట్

Virat & Rohit Announces T20I Retirement : భారత సీనియర్ ఆటగాళ్ళు వరుసగా పొట్టి ఫార్మాట్‌కు రిటైర్‌మెంట్‌ (Retirement) ప్రకటించారు. ముందు విరాట్ కోహ్లీ (Virat Kohli) టీ 20లు ఇక మీదట ఆడనని ప్రకటించాడు. తర్వాత కొద్దిసేపటికే భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) కూడా టీ 20 (T20I) లకు గుడ్‌ బై చెప్పేశాడు. గెలచిన తర్వాత జరిగిన మీడియా మీటింగ్‌లో రోహిత్ తన రిటైర్మెంట్‌ను అధికారికంగా ప్రకటించాడు.

ఇదే నా చివరి ఆట కూడా. నిజాయితీగా, నేను ఈ ఫార్మాట్‌లో ఆడటం ప్రారంభించినప్పటి నుండి నేను దానిని ఆస్వాదించాను. ఈ ఫార్మాట్‌కు వీడ్కోలు చెప్పడానికి ఇంతకంటే మంచి సమయం మరొకటి లేదు. నేను ప్రతి క్షణాన్ని ఇష్టపడుతున్నాను. నేను నా భారత కెరీర్‌ని ఆడటం ప్రారంభించాను. ఈ ఫార్మాట్‌లో నేను కప్ గెలిచిన తర్వాత రిటైర్మెంట్‌ను ప్రకటించాలనుకున్నాను అని అన్నాడు రోహిత్ శర్మ.

Also Read:T20 World Cup: వైరాన్ని పోగొట్టి..ప్రేమను మిగిల్చిన గెలుపు

Advertisment
Advertisment
తాజా కథనాలు