telangana news: తెలంగాణలో కల్తీ పాల కలకలం.. ఎలా చేస్తున్నారో తెలిస్తే షాకవుతారు..! చాలా మంది ఈ మద్య కాలంలో డబ్బు కోసం ఎలాంటి నీచమైన పనులకైనా సిద్దపడుతున్నారు. ఈజీగా డబ్బు సంపాదించడానికి సొంతవాళ్లు, పరాయివాళ్లు అనే తేడా లేకుండా దారుణంగా మోసాలు చేస్తున్నారు. ఇటువంటి వాటిల్లో ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో కల్తీ వ్యాపారులు ఎక్కువ అయ్యారు. ఐస్ క్రీమ్, చాక్లెట్స్, కారం, పసుపు, అల్లం పేస్ట్, పాలు, నూనె ఇలా వంటకు వాడే వాటిలో చాలా వరకు కల్తీ చేస్తున్నారు. By Vijaya Nimma 23 Sep 2023 in తెలంగాణ ఖమ్మం New Update షేర్ చేయండి ఈ మధ్య ప్రతీది కల్తీ అవుతోంది. దీంతో బయట ఏది కొనాలన్నా జాన్నాల్లో వణుకు పుడుతోంది. ముఖ్యంగా నిత్యావసరాలు పాలు, నూనె, కూరగాయలు ఇలా నిత్యావసర వస్తువులు కల్తీ అవుతున్నాయి. తాజాగా ఖమ్మం నగరంలో కల్తీపాల బాగోతం బయటపడింది. 8వ డివిజన్‌లో ఇల్లు అద్దెకు తీసుకుని కల్తీ పాల తయారీ చేస్తున్నారు నిర్వాహకులు. పాలకేంద్రంలో బాయిలర్ బ్లాస్ట్ ప్రమాదం సంభవించడంతో కల్తీపాల బాగోతం వెలుగులోకి వచ్చింది. పాలకేంద్రంలో భారీ మొత్తంలో ఫ్రీడమ్ ఆయిల్ క్యాన్లు, పాలపొడి మిశ్రమంతో తయారు చేసిన పాలను డెయిరీ కేంద్రాలకు తరలిస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్నారు నిర్వాహకులు. ఇంత జరుగుతున్న అధికారులు, పోలీసులు పట్టించుకోకపోవటంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక దీంతో రోజు ఉదయన్నే పాలు, టీ తాగే వారి పరిస్థితి ఎంటో అర్థం కావటం లేదు. Your browser does not support the video tag. నిర్వహకులు అరెస్ట్.. మూడు, నాలుగు రోజుల వ్యవధిలో( సెప్టెంబర్ 20 నుంచి 22)న యాదాద్రి భవనగిరి జిల్లాలో కల్తీ పాలు తయారు చేస్తున్న నిర్వహకుడిని ఫుడ్ సేప్టీ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. కల్తీ పాలు తయారు చేస్తున్నారన్న పక్కా సమాచారంతో అధికారులు తనిఖీలు నిర్వహించారు. భూదాన్‌పోచంపల్లి మండలం భీమనపల్లిలో కప్పల రవి, భువనగిరి మండలం గౌస్‌నగర్‌లోలో అంతటి శ్రీరాములుకు కల్తీ పాలు తయారు చేస్తున్న వ్యాపారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద 350 లీటర్ల కల్తీ పాలు, 100 మీల్లీ లీటర్ల హైడ్రోజన్ పెరాక్సైడ్, 2 డోలోఫర్ స్కిమ్డ్ మిల్క్ ప్యాకెట్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇది కూడా చదవండి: ఏపీలో విషాదం.. విద్యుత్ షాక్‌తో ముగ్గురు మృతి బీ కేర్ ఫుల్ పాలు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిదని డాక్టర్లు చెబుతారు. కానీ.. మనం తాగే పాలు నాణ్యమైనవి కానే కావు. కల్తీ పాల వల్ల మూత్రపిండాల, జీర్ణాశయ సమస్యలు, అతిసారం వంటి వాటి బారిన పడే ప్రమాదం ఉంటుందని వైద్యులు వెల్లడిస్తున్నారు. కల్తీ పాలను గుర్తించాలంటే ఎలా..? మనం తాగే పాలు నాణ్యమైనవేనా.. కావా..? అనేది ఎలా తెలుస్తోంది. ఈ సమస్యల నుంచి కాపాడేదేవరు..? అయితే ఇప్పుడు ఇంట్లోనే సులువుగా కల్తీ పాలను గుర్తించవచ్చని కొంతమంది చెబుతున్నారు. సాధారణంగా పాల కల్తీకి వినియోగించే యూరియా, హైడ్రోజెన్ పెరాక్సైడ్, డిటెర్జెంట్లు, సబ్బు, స్టార్చ్, సోడియం హైడ్రోజెన్ కార్బొనేట్, ఉప్పు వంటి వాటితో పాటు నీరు, జ్యూసులు, మిల్క్‌షేక్‌లలో కల్తీని గుర్తించే కొత్త పరికరాలు మార్కెట్లోకి వస్తున్నాయి. వీటి ద్వారా అయినా మనం ఆరోగ్యాన్ని కాపోడుకోవాల్సి అవసరం ఉంది. #telangana #khammam #adulterated-milk #telugu #8th-division #shocked మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి