Actor Prakash Raj: రూ.100 కోట్ల స్కామ్‌ కేసుకు సంబంధించి నటుడు ప్రకాశ్‌ రాజుకు ఈడీ సమన్లు

ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్‌ సమన్లు పంపింది. రూ.100 కోట్ల పోంజీ స్కామ్‌లో భాగంగా విచారణకు హాజరుకావాలని తెలిపింది. ప్రణవ్ జ్యువెలర్స్‌ సంస్థపై మనీలాండరింగ్ ఆరోపణలున్న నేపథ్యంలో దానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్న ప్రకాశ్‌రాజ్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది.

New Update
Actor Prakash Raj: రూ.100 కోట్ల స్కామ్‌ కేసుకు సంబంధించి నటుడు ప్రకాశ్‌ రాజుకు ఈడీ సమన్లు

ప్రముఖ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సమన్లు జారీ చేసింది. రూ.100 కోట్ల పోంజీ స్కామ్‌లో భాగంగా ఈడీ విచారణకు హాజరుకావాలంటూ నోటీసుల్లో తెలిపింది. తిరుచ్చికి చెందిన ప్రణవ్ జ్యువెలర్స్‌కు ప్రకాశ్‌ రాజ్‌ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. అయితే ఈ పోంజీ స్కీమ్‌తో మోసం చేశారని ఆ సంస్థపై ఇప్పటికే కేసు ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయనకు ఈడీ సమన్లు పంపించిందని అధికారులు చెబుతున్నారు. ఇదిలాఉండగా.. ఈనెల 20న ప్రణవ్‌ జ్యువెలర్స్ కంపెనీ కార్యాలయాల్లో ఈడీ తనిఖీలు చేసింది. అయితే ఈ సోదాల్లో ఆ సంస్థ వద్ద లెక్కల్లో చూపించని రూ.23.70 లక్షల నగదుతో పాటు బంగారు ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Also Read: మహువా మొయిత్రా వివాదం.. ఎట్టకేలకు మౌనం వీడిన మమతా బెనర్జీ..

తమిళనాడు పోలీసు ఆర్థిక నేరాల విభాగం ఆ సంస్థపై నమోదు చేసిన కేసు ఆధారంగా మనీ లాండగింగ్ ఆరోపణలపై ఈడీ విచారణ చేపట్టింది. అయితే బంగారంపై పెట్టుబడుల పథకం కింద ప్రజలకు ఆశ చూపించి వారి నుంచి ఆ సంస్థ రూ.100 కోట్ల వరకు సేకరించినట్లు పోలీసులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదిలాఉండగా.. ఈ మధ్యకాలంలో ప్రకాశ్‌రాజ్‌ బీజేపీపై తీవ్రంగా విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు ప్రస్తుతం ఈడీ నోటీసులు రావడం చర్చనీయాంశమవుతోంది.

Also Read: కాంగ్రెస్‌లో 10 మంది సీఎంలు ఉన్నారు, జగ్గారెడ్డి ఎమ్మెల్యేగా కూడా గెలవడు : హరీష్‌రావు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Crime News: టీచర్ కాదు టార్చర్.. హోం వర్క్ చేయలేదని విద్యార్థినితో దారుణం.. లేడీ టీచర్‌కు రూ.2 లక్షల జరిమానా!

ఏడో తరగతి విద్యార్థిని హోంవర్క్ చేయలేదని టీచర్ 600గుంజీలు తీయించిన ఘటన తమిళనాడులో చోటుచేసింది. ప్రస్తుతం ఆ బాలిక హాస్పిటల్‌లో చికిత్స పొందుతుంది. ఆమె తల్లిదండ్రులు మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేయగా.. విచారణ జరిపి టీచర్‌కు రూ.2లక్షల జరిమానా విధించింది.

New Update
tamil nadu teacher fines 2 lakh rupees

tamil nadu teacher fines 2 lakh rupees

విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించాల్సిన ఓ లేడీ టీచర్ అమానవీయ చర్యకు పాల్పడింది. విద్యార్థిని హోం వర్క్ చేయలేదని.. దారుణమైన శిక్ష విధించింది. మొత్తం 600 గుంజీలు విద్యార్థినితో తియ్యించింది. దీంతో ఈ విషయం మానవ హక్కుల కమిషన్‌ వద్దకు చేరడంతో.. లేడీ టీచర్‌కు భారీ జరీమానా విధించింది. దాదాపు రూ.2 లక్షల వరకు జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

600 గుంజీలు

ఈ ఘటన తమిళనాడులో జరిగింది. శివగంగై జిల్లా తిరుమానగర్‌కి చెందిన పాండిసెల్వి కూతురు సమీపంలో ఉన్న ప్రభుత్వ స్కూల్లో 7వ తరగతి చదువుతోంది. ఆమె హోం వర్క్‌ చేయలేదని లేడీ టీచర్ చిత్ర ఊహించని శిక్ష విధించింది. మొదటి రోజు 200 గుంజీలు తీయించింది. అక్కడితో ఆగకుండా మరుసటి రోజు మరో 400 గుంజీలు తీయించింది. 

దీంతో ఆ బాలిక స్పృహ కోల్పోయింది. వెంటనే ఆ బాలికను తోటి స్నేహితులు సైకిల్‌పై ఇంటికి తీసుకొచ్చారు. ఆ రోజు నుంచి ఆ బాలిక అనారోగ్యం బారిన పడింది. ఆమె ఆరోగ్యం క్షీణించడంతో తల్లిదండ్రులు హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అనంతరం లేడీ టీచర్ పై స్టూడెంట్ తల్లిదండ్రులు చెన్నైలోని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆమె చర్య వల్లనే తన కుమార్తె ఆరోగ్యపరంగా, మానసికంగా దెబ్బతిందని.. అందువల్ల టీచర్ చిత్రపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

దీంతో ఆ ఫిర్యాదుపై వివరణ ఇవ్వాలని కమిషన్ పలు మార్లు ఆ టీచర్‌కు నోటీసులు పంపించింది. కానీ ఆ టీచర్ స్పందించకపోవడంతో విచారణ జరిపిన కమిషన్ భారీ జరిమాన విధించింది. పిటిషనర్‌ పాండిసెల్వి కూతురికి రాష్ట్ర ప్రభుత్వం రూ.2 లక్షల పరిహారం అందజేయాలని తెలిపింది. అయితే ఆ నగదును లేడీ టీచర్‌ నుంచి వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

crime news | viral-news | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment