Radission Drugs Case: మరోసారి డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ మోడల్ లిషి గణేష్

గచ్చిబౌలిలోని రాడిసన్ డ్రగ్స్‌ కేసులో మరోసారి మోడల్ కల్లపు లిషి గణేష్‌ పట్టుబడ్డారు. రెండేళ్ల క్రితమే రాడిసన్‌ హోటల్‌లో మింక్‌ పబ్‌ డ్రగ్స్‌ కేసులో ఆమె తన సోదరి కుషితా కల్లపుతో కలిసి పోలీసులకు చిక్కారు. అయితే తాజాగా ఆమె మరోసారి పట్టుబడటం చర్చనీయాంశమైంది.

New Update
Radission Drugs Case: మరోసారి డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ మోడల్ లిషి గణేష్

గచ్చిబౌలిలోని రాడిసన్ డ్రగ్స్ కేసులో ఒక్కొక్కటిగా సంచలనాలు బయటకు వస్తున్నాయి. తాజాగా ఈ కేసులో మరోసారి మోడల్ కల్లపు లిషి గణేష్‌ పట్టుబడ్డారు. రెండేళ్ల క్రితమే రాడిసన్‌ హోటల్‌లో మింక్‌ పబ్‌ డ్రగ్స్‌ కేసులో ఆమె తన సోదరి కుషితా కల్లపుతో కలిసి పోలీసులకు చిక్కారు. ఆ సమయంలో తాము డ్రగ్స్‌ తీసుకోలేదని.. కేవలం బజ్జీలు మాత్రమే ఆర్డర్‌ ఇచ్చామని కుషిత పోలీసులకు చెప్పారు. ఈ సమాధానంతో ఆమె సోషల్ మీడియాలో వైరలైపోయింది. అయితే తాజాగా డ్రగ్స్‌ కేసులో కుషిత సోదరి లిషి గణేష్‌ పట్టుబడ్డారు.

Also Read: సింగరేణి ఉద్యోగులకు అదిరిపోయే వార్త చెప్పిన రేవంత్ సర్కార్..ఒక్కొక్కరికి రూ.కోటి ప్రమాద బీమా..!

9 మందిపై కేసు నమోదు

ఈ డ్రగ్‌ కేసుకు సంబంధించి ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు కీలక విషయాలు చేర్చారు. మొత్తం 9 మంది నిందితులపై ఎన్డీపీఎస్‌ (Narcotic Drugs and Psychotropic Substances Act) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. అయితే ఈ డ్రగ్స్ వినియోగించినవారిలో ఇద్దరు యువతులతో సహా 8 మందిపై అలాగే వీరికి కొకైన్ విక్రయించిన అబ్బాస్‌ అలీపై కేసు నమోదు చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. గచ్చిబౌళిలోని స్టార్‌ హోటల్‌లో ఆదివారం అర్ధరాత్రి పార్టీ చేసుకొని.. మత్తు పదార్థాలు, కొకైన్ తీసుకున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది.

పరారీలో నిందితులు 

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దాడులు నిర్వహించారు. మంజీరా గ్రూప్‌ డైరక్టర్‌ వివేకానంద అనే వ్యక్తితో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. కొకైన్‌ను రోల్‌లో చుట్టి నిందితులు డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే తరచుగా అదే హోటల్‌లో పార్టీలు చేసుకుంటామని.. నిందితుడు వివేకానంద్‌ పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ పార్టీలో వివేకానంద్‌తో పాటు కేదార్, క్రిష్, నిర్భయ్, లిషి గణేష్, శ్వేత, రఘుచరణ్, నీల్, సందీప్‌లు పాల్గొన్నారు. వీళ్లలో వివేకానంద్, కేదార్, నిర్భమ్‌లను పోలీసులు అరెస్టు చేశారు. ఇక మిగిలిన నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వాళ్లని కూడా అదుపులోకి తీసుకుంటామని గచ్చిబౌళి పోలీసులు చెబుతున్నారు.

Also Read: 2 నెలల్లో రూ.10 వేల కోట్లు అప్పు? బండి సంజయ్‌ సంచలనం

Advertisment
Advertisment
తాజా కథనాలు