Telangana : బాసర ట్రిపుల్‌ఐటీలో మరో విద్యార్థి ఆత్మహత్య

బాసర ఆర్జేయూకేటీలో తాజాగా మరో విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పీయూసీ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి మంగళవారం తాను ఉంటున్న హాస్టల్‌ గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

New Update
AP: దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను భార్య ఏం చేసిందంటే?

Basara : ఇటీవల బాసర ఆర్జేయూకేటీ(RJUKT) లో వరుసగా విద్యార్థుల ఆత్మహత్యలు(Suicide) ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరో విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పీయూసీ రెండో సంవత్సరం(PUC 2nd Year) చదువుతున్న అరవింద్ అనే విద్యార్థి మంగళవారం తాను ఉంటున్న హాస్టల్‌ గది(Hostel Room) లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల ఇంటికి వెళ్లొచ్చిన విద్యార్థి.. పరీక్షల కోసం ఏప్రిల్ 12న యూనివర్సిటీకి వచ్చాడు.

Also Read: కూనంనేని సాంబశివరావుపై కేసు నమోదు.. ఎందుకంటే

హాజరుశాతం తక్కువగా ఉండటంతో అధికారులు అతడిని పరీక్ష రాసేందుకు పర్మిషన్ ఇవ్వలేదు. తల్లిదండ్రలకు ఫోన్‌చేసిన అతడు.. హాజరు శాతం తక్కువగా ఉందని ఇంటికి తీసుకెళ్లాలని ఫోన్ చేసి చెప్పాడు. కానీ వాళ్లు రాలేదు. దీంతో ఆ విద్యార్థి హాస్టల్‌లోనే ఉన్నాడు. తోటి విద్యార్థులు పరీక్షలకు వెళ్లిన కొద్దిసేపటికే గదిలో ఉరేసుకున్నాడు. ఆ తర్వాత గదిలోకి వచ్చిన విద్యార్థులు అతడిని చూసి షాకయ్యారు. వెంటనే అధికారులకు ఈ విషయం చెప్పారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిర్మల్ ఆసుపత్రి(Nirmal Hospital) కి తరలించారు.

Also Read: నదిలో పడవ బోల్తా.. నలుగురు మృతి

Advertisment
Advertisment
తాజా కథనాలు