Telangana: నాన్‌వెజ్ తెచ్చాడని విద్యార్థిని బహిష్కరించిన స్కూల్ ప్రిన్సిపాల్ ఉత్తరప్రదేశ్‌లో అమానుష సంఘటన చోటుచేసుకుంది. ఓ విద్యార్థి క్లాసులోకి నాన్ వెజ్ తీసుకొచ్చాడన్న కారణంతో స్కూల్ ప్రిన్సిపాల్ అతడిని బహిష్కరించాడు. సెప్టెంబర్ 5న టీచర్స్ డే రోజునే ఈ ఘటన జరిగింది. దీంతో ఈ వ్యవహారంపై అధికారులు విచారణకు ఆదేశించారు. By B Aravind 06 Sep 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి పాఠశాల అంటే విద్యార్థులకు జ్ఞానాన్ని ప్రసాదించే చోటు. అక్కడ ఎలాంటి బేధాభావాలు లేకుండా, వివక్ష చూపించకుండా అందరూ సమానులే అని విద్యార్థులకు బోధించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే. కానీ పాఠశాలలోనే విద్యార్థుల మధ్య హిందూ-ముస్లిం భావనను సృష్టించడం దారుణం. అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఓ విద్యార్థి క్లాసులోకి నాన్ వెజ్ తీసుకొచ్చాడన్న కారణంతో స్కూల్ ప్రిన్సిపాల్ అతడిని బహిష్కరించాడు. సెప్టెంబర్ 5న టీచర్స్ డే రోజునే ఈ ఘటన జరిగింది. స్కూల్ ప్రిన్సిపాల్, విద్యార్థి తల్లి మధ్య జరిగిన వాగ్వాదం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వ్యవహారం అధికారుల దృష్టికి వెళ్లడంతో దీనిపై విచారణకు ఆదేశించారు. Also Read: వరదల ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ ఆర్థిక సాయం ఆ వీడియోలో గమనిస్తే.. హిల్‌టాన్ కాన్వెంట్ స్కూల్ ప్రిన్సిపాల్ తన గదిలో ఆ విద్యార్థి తల్లితో వాగ్వాదానికి దిగాడు. మీ అబ్బాయి నిత్యం నాన్ వెజ్ ఆహారాన్ని క్లాస్‌లోకి తీసుకొస్తున్నాడని చెప్పాడు. మిగతా విద్యార్థులందరిని కూడా నాన్ వెజ్ తినేలా చేయించి అందరిని ఇస్లాం మతంలోకి మార్చాలని చూస్తున్నాడని ఆరోపించారు. అంతేకాదు ఆ విద్యార్థి హిందూ ఆలయాలని కూల్చాలని అనుకుంటున్నాడని అన్నాడు. మీ అబ్బాయికి ఇలాంటివే నేర్పిస్తున్నారా అని మండిపడ్డారు. మరోవైపు ప్రిన్సిపాల్ చేసిన వ్యాఖ్యలను ఆ విద్యార్థి తల్లి ఖండించారు. గత మూడు నెలల నుంచి తన కొడుకు క్లాస్‌లోని విద్యార్థులు హిందూ-ముస్లిం విభేదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఆ రోజు తరగతి గదిలో ఉదయం నుంచి కూడా తన అబ్బాయిని కూర్చోనివ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక చివరికి ఆ స్కూల్ ప్రిన్సిపాల్.. మీ అబ్బాయికి ఇకనుంచి ఇక్కడ పాఠాలు చెప్పమని.. స్కూల్ నుంచి తొలగిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్కూల్ ప్రిన్సిపాల్‌పై నెటీజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాన్ వెజ్ తెచ్చుకున్నంత మాత్రనా విద్యార్థిని మతపరంగా భేదం చూపించడం ఏంటని తిట్టిపోస్తున్నారు. Hindu principal in UP, India refuses to teach 7yr old Muslim student, citing baseless accusations. When will we end hate & ignorance? #Islamophobia #HinduMuslimUnity #EducationForAll #StopHate pic.twitter.com/AxhRUXNI0i — Anubad News (@AnubadNews) September 6, 2024 Also Read: కర్ణాటకలో కరోనా స్కామ్.. రూ.1000 కోట్లు స్వాహా ! #telugu-news #national-news #uttar-pradesh #school-principal మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి