/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-68-1-jpg.webp)
Maharashtra : మహారాష్ట్రలో భారీ అగ్ని (Fire accident) ప్రమాదం జరిగింది. హ్యాండ్ గ్లవ్స్ (Hand gloves) ఫ్యాక్టరీలో ఆదివారం తెల్లవారు జామున ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అక్కడికక్కడే ఆరుగురు సజీవదహనం అయ్యారు. భారీగా ఆస్తినష్టం జరగడంతోపాటు పలువురు తీవ్రంగా గాయపడ్డట్లు స్థానికులు, పోలీసులు తెలిపారు.
#WATCH | Chhatrapati Sambhajinagar, Maharashtra: Fire breaks out in a factory in the Waluj MIDC area. Operations to douse the fire are underway. Further details awaited. pic.twitter.com/mY9ChJv8n8
— ANI (@ANI) December 30, 2023
ఈ మేరకు ఆదివారం తెల్లవారుజామున 2.15 గంటల సమయంలో ఔరంగాబాద్ సమీపంలోని వలుజ్ ఛత్రపతి శంభాజీనగర్‌లో ఈ దుర్ఘటన చోటుచేసుకుందని అగ్నిమాపక అధికారి మోహన్ ముంగ్సే తెలిపారు. వలూజ్ ఎంఐడీసీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించినట్లు తమకు సమాచారం అందిందగానే పోలీసు అధికారులతో అక్కడికి చేరుకున్నామని, ఘటనా స్థలానికి చేరుకునే సరికి ఫ్యాక్టరీ మొత్తం కాలిపోయిందని చెప్పారు. అయితే ఈ ప్రమాదంలో లోపల ఆరుగురు చిక్కుకున్నారని స్థానికులు చెప్పడంతో తమ సిబ్బంది ఫ్యాక్టరీ లోపలికి ప్రవేశించి మృతదేహాలను వెలికితీశారని తెలిపారు. అయితే, అగ్ని ప్రమాదం సంభవించిన సమయంలో ఫ్యాక్టరీలో దాదాపు 10 -15 మంది నిద్రిస్తున్నట్లు బాధితులు తెలిపారు. కొందరం తప్పించుకోగలిగామని, మిగిలిన వారు మంటల్లో చిక్కుకొని మరణించినట్లు వాపోయారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు, మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు.
#WATCH | Chhatrapati Sambhajinagar, Maharashtra: Fire breaks out in a factory in the Waluj MIDC area. Operations to douse the fire are underway. Further details awaited. pic.twitter.com/mY9ChJv8n8
— ANI (@ANI) December 30, 2023
ఇది కూడా చదవండి : Jayaprada: నటి జయప్రద మిస్సింగ్ ..వెతుకుతున్న పోలీసులు!
ఇక మంటలు ఎందుకు, ఎలా చెలరేగాయి అనే సమాచారం ఇంకా తెలియరాలేదు. మంటలు చెలరేగిన సమయంలో ఫ్యాక్టరీలో ప్రజలు నిద్రిస్తున్నారని కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగి తెలిపారని పోలీసులు వెల్లడించారు.