Madhyapradesh: ఘోర ప్రమాదం...ప్రయాణికులతో వెళ్తున్న బస్సులో అగ్నిప్రమాదం...12మంది సజీవ దహనం..!!

మధ్యప్రదేశ్‌లోని గుణలో పెను విషాదం నెలకొంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో చిక్కుకుని 12 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు. బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నారు.

New Update
Madhyapradesh: ఘోర ప్రమాదం...ప్రయాణికులతో వెళ్తున్న బస్సులో అగ్నిప్రమాదం...12మంది సజీవ దహనం..!!

మధ్యప్రదేశ్ లోని గుణ జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. డంపర్, బస్సు ఢీకొనడంతో బస్సులో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు సజీవదహనమయ్యారు. మంటల్లో 12 మంది మరణించినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలంలో ఉన్న వ్యక్తుల ప్రకారం బస్సులో నుంచి 11 మంది మృతదేహాలను వెలికి తీసినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఎస్సీ విజయ్ ఖత్రీ కూడా ధ్రువీకరించారు. తీవ్రంగా గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే మరింత పెరిగే అవకాశం ఉంది.

నేషనల్ మీడియా సమాచారం మేరకు బుధవారం రాత్రి బస్సు గుణ నుంచి ఆరోన్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రాత్రి 8.30గంటల ప్రాంతంలో గుణ జిల్లాలో డంపర్ ను ఢీ కొట్టింది. దీంతో బస్సు బోల్తాపడింది. అనంతరం బస్సులో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో 12 మంది సజీవదహనమైనట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి కొంతమంది రక్షించి ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై సీఎం మోహన్ యాదవ్ విచారణకు ఆదేశించారు. ఘటనపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతామని హామీ ఇచ్చారు. ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని రవాణా శాఖను ఆదేశించారు. బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 4లక్షలు, క్షతగాత్రులకు రూ. 50వేల చొప్పున సాయం అందించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.

ఇది కూడాచదవండి: ఈ టిప్స్‌ పాటిస్తే వయసు పెరుగుతున్నా యవ్వనంగా కనిపిస్తారు..!

Advertisment
Advertisment
తాజా కథనాలు