Zomato: శాకాహారం ఆర్డర్ ఇస్తే..మాంసాహారం..క్షమాపణలు చెప్పిన జొమాటో! ఢిల్లీకి చెందిన హిమాన్షి అనే యువతి జొమాటో ద్వారా వెజ్ ఆహారం ఆర్డర్ పెట్టింది. అయితే ఆమెకు మాంసాహార వంటకం డెలివరీ అయ్యింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలిపింది.ఈ పోస్టుపై స్పందించిన జొమాటో వెంటనే క్షమాపణ కోరింది.ఈ పోస్టుపై స్పందించిన జొమాటో వెంటనే క్షమాపణ కోరింది By Bhavana 29 Jul 2024 in బిజినెస్ నేషనల్ New Update షేర్ చేయండి Zomato: దేశంలో ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్ ఇచ్చేవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఫుడ్ డెలివరీల డిమాండ్ కు తగ్గట్లే కొత్త యాప్ సర్వీసులు కూడా రోజుకొకటి అందుబాటులోకి వస్తున్నాయి. అయితే ఆన్‌లైన్ ఆర్డర్ ద్వారా డెలివరీ అవుతున్న ఆహార పదార్థాల నాణ్యతపై దేశంలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఇలాంటి సంఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. ఢిల్లీకి చెందిన హిమాన్షి అనే యువతి జొమాటో ద్వారా వెజ్ ఆహారం ఆర్డర్ పెట్టింది. అయితే ఆమెకు మాంసాహార వంటకం డెలివరీ అయ్యింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలిపింది. ‘‘ జొమాటో ద్వారా ఈట్‌ఫిట్ నుంచి పాలక్ పనీర్ సోయా మటర్, మిల్లెట్ పులావ్ ఆర్డర్ పెట్టాను. కానీ పాలక్ పనీర్‌కు బదులు చికెన్ పాలక్‌ని డెలివరీ చేశారు. నేను శాకాహారం మాత్రమే ఆర్డర్ పెట్టినప్పుడు చికెన్ డెలివరీ ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు’’ అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను ట్విటర్ వేదికగా షేర్ చేశారు. ఈ పోస్టుపై స్పందించిన జొమాటో వెంటనే క్షమాపణ కోరింది. సమస్యను పరిశీలిస్తున్నామని, వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని సమాధానం ఇచ్చింది. తప్పును సరిదిద్దుకుంటామని, అసౌకర్యానికి చింతిస్తున్నామని పేర్కొంది. ఈ ఘటనపై ఈట్‌ఫిట్ రెస్టారెంట్ కూడా క్షమాపణలు కోరింది. ‘‘మీకు ఎదురైన అనుభవం పట్ల చింతిస్తున్నాం. దయచేసి మీ ఆర్డర్, సంప్రదింపు వివరాలు అందించండి’’ అని తెలిపింది. Also read: గుర్రపు స్వారీ చేస్తూ కిందపడి…యువకుడి మృతి!. #delhi #social-media #zomato #non-veg #veg మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి