/rtv/media/media_files/2025/02/08/FlI5VjtRDVnH6VbEjqZU.jpg)
Smugling Photograph: (Smugling )
అక్రమంగా బంగారం రవాణా చేస్తున్న నలుగురు మహిళలను ముంబై అధికారులు అరెస్టు చేశారు. అక్రమ రవాణాపై ఆరోపణలు రావడంతో ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో కెన్యాకు చెందిన నలుగురు మహిళలను అరెస్టు చేశారు. మొత్తం 5.185 కిలోల బంగారాన్ని వారి దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఇది కూడా చూడండి: Trump-America: అమెరికాలోని భారతీయులకు బిగ్ రిలీఫ్.. ఆ ఉత్తర్వులను కొట్టిపారేసిన కోర్టు
బుర్ఖాలు ధరించి..
ఈ బంగారం విలువ దాదాపుగా రూ.4 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఆ నలుగురు మహిళలు బుర్ఖాలు, ధరించిన దుస్తుల్లో దాచి బంగారం తీసుకొచ్చినట్లు అధికారులు గుర్తించారు. కెన్యాలోని నైరోబి నుంచి ముంబైకి వచ్చిన ఆ నలుగురు మహిళలు బంగారం స్మగ్లింగ్ చేస్తున్నారు. అధికారులకు సమాచారం రావడంతో వారిని అరెస్టు చేశారు.
ఇది కూడా చూడండి: Jeeth Adani: గుజరాతీ సంప్రదాయంలో వేడుకగా గౌతమ్ అదానీ చిన్న కుమారుడి వివాహం!
ఇదిలా ఉండగా బ్రెజిల్ (Brazil) లోని సావో పాలో నగరంలో భారీ విమాన ప్రమాదం (Plane Crash) జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. కింగ్ ఎయిర్ F90 లైట్ ఎయిర్‌క్రాఫ్ట్ విమానం.. పశ్చిమ భాగంలోని పోర్టో అలెగ్రేకు వెళుతుండగా మార్క్వెస్ డి సావో విసెంటే అనే ప్రాంతంలో కూలిపోయింది. విమానం అత్యవసరంగా ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నిస్తుండగా నడిరోడ్డుపై పడి బస్సును ఢీకొట్టింది.
ఇది కూడా చూడండి: Horoscope Today:నేడు ఈ రాశి వారికి ఆదాయం పదింతలు అవుతుంది...మీ రాశేనేమో చూసుకోండి మరి!
దీంతో విమానంలో మంటలు చెలరేగాయి. అనంతరం కాలిపోయిన విమానంలో రెండు మృతదేహాలను గుర్తించారు. అలాగే ఈ ప్రమాదంలో బస్సు లోపల ఉన్న ఒక మహిళ గాయపడింది. ఆ సమయంలో రోడ్డు దాటుతున్న మోటార్‌సైకిలిస్ట్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. వీరిద్దరికీ అత్యవసర చికిత్స అందిస్తున్నారు.