Tech News : కొత్త ఫోన్ కొంటున్నారా? అయితే.. మీ పాత ఫోన్‌ను ఈ 5 సైట్లలో అమ్మేయండి!

మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ఆలోచిస్తూ.. అదే సమయంలో పాత ఫోన్‌ను విక్రయించాలనుకుంటున్నారా? అయితే ఇన్‌స్టాక్యాష్, క్యాషిఫై, బుడ్లి, Olx, ఫ్లిప్‌కార్ట్‌లో పాత మొబైల్స్‌ను సేల్‌కు పెట్టవచ్చు. ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్, టీవీ లాంటి ఇతర పరికరాలను కూడా విక్రయించవచ్చు.

New Update
Tech News : కొత్త ఫోన్ కొంటున్నారా? అయితే.. మీ పాత ఫోన్‌ను ఈ 5 సైట్లలో అమ్మేయండి!

5 Sites To Sell Old Mobiles : క్రిస్మస్‌(Christmas), న్యూఇయర్‌(New Year 2024), సంక్రాంతి(Sankranti).. వరుస పెట్టి స్పెషల్‌ డేస్‌ వచ్చేస్తున్నాయి. కొత్త ఇయర్‌ వస్తుంది కదా.. కొత్త ఫోన్‌ కొందాం అని చాలా మంది ఆలోచిస్తుంటారు. మరికొంతమంది క్రిస్మస్‌కు కొనుగోలు చేయాలని.. ఇంకొంతమంది సంక్రాంతికి కొత్త మొబైల్ తీసుకుందామని ప్లాన్ చేస్తుంటారు. పాత మొబైల్‌పై కొంతమందికి ఇంట్రెస్ట్ పోయి ఉంటుంది. మరికొంతమందికి దానిపై ఇష్టం ఉన్నా వదలించుకోవాల్సిన దుస్థితి. ఎందుకంటే పాత ఫోన్‌ను అమ్మేస్తే కొత్త ఫోన్‌ కొనే బడ్జెట్‌కు కాస్త హెల్త్ అవుతుంది. మరి మీరు కూడా మీ పాత ఫోన్‌ను అమ్మేయాలని థింక్‌ చేస్తున్నారా? ఎక్కడ అమ్మాలో తెలియడం లేదా? అయితే ఈ న్యూస్‌ మీకోసమే.

ఫ్లిప్‌కార్ట్:
పాత ఫోన్‌లను విక్రయించడానికి ఫ్లిప్‌కార్ట్(Flipkart) మంచి మార్కెటింగ్‌ సైట్. మీరు మీ పాత మొబైల్‌ని సేల్ బ్యాక్ ప్రోగ్రామ్ కింద విక్రయించుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ఇ-వోచర్ రూపంలో సరైన బై-బ్యాక్ విలువను పొందుతారు. ఈ ప్రోగ్రామ్ దేశంలోని 1,700 పిన్‌కోడ్‌లలో అందుబాటులో ఉంది.

Olx:
ఇది ఎక్కువ మంది యూజ్‌ చేసే ఫ్లాట్‌ఫారమ్‌. పాత వస్తువులను అమ్మడం, కొనుగోలు చేయడం ఎక్కువగా ఈ ఫ్లాట్‌ఫారమ్‌లో జరుగుతుంటాయి.

బుడ్లి:
బుడ్లి కూడా పాత హ్యాండ్‌సెట్‌లతో అమ్ముకునేందుకు ఉన్న ఆప్షన్స్‌లో ఒక వెబ్‌సైట్. మీ ఫోన్ చాలా పాతది అయితే మీరు కంపెనీకి రిక్వెస్ట్ పెట్టవచ్చు. కంపెనీ మీకు 7 గంటల్లో రిప్లై ఇస్తుంది. కంపెనీకి చెందిన వ్యక్తులు మొబైల్ కోసం మీ ఇంటికి వస్తారు. మీ డబ్బు 24 గంటల్లోనే రిటర్న్ అవుతుంది.

క్యాషిఫై:
మీరు మీ పాత ఫోన్‌ను విక్రయించాలనుకుంటే క్యాషిఫై(Cashify) ఒక ఫేమస్‌ సైట్. మీరు ఈ సైట్ నుంచి పాత ఫోన్‌లను కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ ప్లాట్‌ఫారమ్ పాత ఫోన్‌లను విక్రయించడానికి బెస్ట్‌ సైట్‌గా యూజర్లు చెబుతుంటారు. ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్, టీవీ లాంటి ఇతర పరికరాలను కూడా ఇక్కడ విక్రయించవచ్చు. ఈ ప్లాట్‌ఫారమ్ మీకు డోర్‌స్టెప్ పికప్ సౌకర్యాన్ని కూడా అందిస్తుంది.

ఇన్‌స్టాక్యాష్:
ఇది కూడా ట్రస్ట్‌బుల్‌ ఫ్లాట్‌ఫారమ్. చెడిపోయిన ఫోన్‌లను కూడా ఈ ఫ్లాట్‌ఫారమ్‌ అంగీకరిస్తుంది. మీరు ఎలా చెల్లించాలో కూడా ఇక్కడ నిర్ణయించుకోవచ్చు. అయితే.. ఈ ప్లాట్‌ఫారమ్ పికప్ కోసం కూడా వసూలు చేస్తుంది. ప్రస్తుతం ఇది 19 పెద్ద నగరాల్లో తన సేవలను అందిస్తోంది.

Also Read: టీమిండియాకు డబుల్ షాక్‌! తోపు, తురుము ఇద్దరూ ఔట్!

WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు