Uttarakhand: ఉత్తరాఖండ్ లో కొండ చరియలు విరిగిపడి నలుగురి మృతి! మంగళవారం ఉదయం నుంచి రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణశాఖ హెచ్చరించింది. అంతేకాకుండా రెండు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. చంబా, మండి జిల్లాల్లోని క్యాచ్‌మెంట్ ఏరియాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ ముంచెత్తడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ పేర్కొంది. By Bhavana 22 Aug 2023 in నేషనల్ New Update షేర్ చేయండి 4 Dead in Uttarakhand: హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను భారీ వర్షాలు, వరదలు ఇప్పట్లో వదిలేటట్లు కనిపించడం లేదు. కొద్ది రోజులు క్రితం కురిసిన భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడడంతో చాలా మంది చనిపోగా..అనేక మంది గల్లంతవ్వడంతో పాటు గాయాలు పాలయ్యారు కూడా. కొండ చరియలు విరిగి వాహనాలు మీద, ఇళ్ల మీద పడడంతో ఆస్తి నష్టం కూడా బాగా జరిగింది. అక్కడితో ముగిసింది అనుకోవడానికి లేకుండా..మళ్లీ మంగళవారం ఉదయం నుంచి రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణశాఖ హెచ్చరించింది. అంతేకాకుండా రెండు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. చంబా, మండి జిల్లాల్లోని క్యాచ్‌మెంట్ ఏరియాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ ముంచెత్తడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ పేర్కొంది. ఇదిలా ఉంటే ఉత్తరాఖండ్ తెహ్రీ జిల్లాలో సోమవారం చంబా ప్రాంతంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఇద్దరు మహిళలతో పాటు నాలుగు నెలల చిన్నారి కూడా ఉంది. అంతేకాకుండా ఆ ప్రమాదంలో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కూడా అధికారులు మొదలు పెట్టారు. కొండ చరియలు విరిగి రోడ్డు కి అడ్డంగా పడడంతో తెహ్రీ-చంబా ప్రాంతాలకు రాకపోకలు ఆగిపోయాయి. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. Also Read: విమానంలో రక్తం కక్కుకుని వ్యక్తి మృతి! #rains #floods #uttarakhand-floods #himachal-pradesh-floods #himachal-pradesh #uttarakhand-rains #uttarakhand #heavy-rains-in-himachal-pradesh #4-dead-in-uttarakhand #heavy-rains-in-uttarakhand మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి