Watch Video: కొంపముంచిన మెడికల్ స్టూడెంట్స్‌ రీల్స్‌.. చివరికి..

కర్ణాటకలోని గడగ్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ మెడికల్ సైన్సెస్‌ (GIMS)లో చదువుతున్న కొందరు విద్యార్థులు.. ఆసుపత్రిలో రీల్స్‌ చేసిన వీడియో వైరల్ అయ్యింది. ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా ఇలా రీల్స్‌ చేయడంపై కళాశాల యాజమాన్యం వారికి ఫైన్‌ విధించింది.

New Update
Watch Video: కొంపముంచిన మెడికల్ స్టూడెంట్స్‌ రీల్స్‌.. చివరికి..

38 Medical Students Suspended: ఇప్పుడు ప్రతిఒక్కరి చేతుల్లోకి స్మార్ట్‌ఫోన్లు వచ్చాక సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. రోజులో కొన్ని గంటల పాటు వాట్సాప్, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌లలోనే జనాలు గడుపుతున్నారు. కొంతమంది తమ ప్రతిభను చూపించుకుని తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటారు. మరికొందరు పాపులారిటీ కోసం వింత పనులు చేస్తూ హల్‌చల్‌ చేస్తుంటారు. ప్రస్తుతం సోషల్‌మీడియాలో రీల్స్‌ అనేవి ట్రెండంగ్‌లో ఉన్నాయి. ఈ రీల్స్‌ చేసి కూడా కొందరు తమ ఫాలోయింగ్‌ని పెంచుకుంటున్నారు. అయితే తాజాగా కర్ణాటలో (Karnataka) ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. కొందరు వైద్యవిద్యార్థులు ఏకంగా ఆసుపత్రిలోనే రీల్స్‌ (Reels) చేశారు.

Also Read: ‘ఛలో ఢిల్లీ’కి పిలుపునిచ్చిన రైతులు.. బార్డర్లు మూసేసిన ప్రభుత్వం

పర్మిషన్ తీసుకోలేదు

ఇక వివరాల్లోకి వెళ్తే.. గడగ్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ మెడికల్ సైన్సెస్‌ (GIMS)లో చదువుతున్న38 మంది విద్యార్థుల శిక్షణ మరో 20 రోజుల్లో పూర్తి కానుంది. త్వరలోనే ఆ కాలేజీలో ఫ్రీ గ్రాడ్యుయేషన్ కార్యక్రమం జరగనుంది. దీనికోసం ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండానే ఆ విద్యార్థులు ఆసుపత్రిలో రీల్స్‌ చేశారు. అయితే ఈ వీడియో వైరల్‌ అయింది. దీంతో విద్యార్థుల చర్యపై కళాశాల యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేసింది.

విద్యార్థులకు ఫైన్ 

ఆసుపత్రిలో రీల్స్ చేసేందుకు విద్యార్థులకు యాజమాన్యం ఎలాంటి అనుమతి ఇవ్వలేదని కళాశాల డైరెక్టర్‌ డా.బసవరాజ్ అన్నారు. ఇలాంటి వాటిని తాము ప్రోత్సహించమని.. వాళ్లు ఏం చేయాలనుకున్న ఆసుపత్రి బయట చేయాలని అన్నారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు.. వారికి జరిమానాతో పాటు ట్రైనింగ్‌ను (Training) మరో 10 రోజులు పొడగించామని తెలిపారు. ఇదిలాఉండగా.. ఇటీవల చిత్రదుర్గ అనే జిల్లాలో ఉన్న ఆసుపత్రిలో.. ఓ వైద్యుడు ఆపరేషన్ గదిలో తన ప్రీవెడ్డింగ్ షూట్ చేసిన సంగతి తెలిసందే. దీనిపై స్పందించిన కర్ణాటక వైద్యారోగ్య శాఖ మంత్రి దినేశ్ గుండురావ్ (Dinesh Gundu Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యుడ్ని వెంటనే సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Also Read: కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ సోదాలు.. ఎఫ్ఐఆర్ నమోదు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Canada: కెనడాలో ఊహించని పరిణామం.. పార్లమెంట్‌కు తాళాలు

కెనడా పార్లమెంటు భవనాన్ని ఒట్టావా పోలీసులు తాత్కాలికంగా మూసివేశారు. శనివారం ఆ భవనంలోకి ఓ గుర్తు తెలియని దుండగుడు ప్రవేశించాడని అందుకే మూసివేసినట్లు పోలీసులు చెప్పారు. ఆదివారం ఉదయం అతడిని అందుబాటులోకి తీసుకుని దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.

New Update
Canada parliament briefly put on lockdown

Canada parliament briefly put on lockdown

కెనడాలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అక్కడి పార్లమెంటు భవనాన్ని ఒట్టావా పోలీసులు తాత్కాలికంగా మూసివేశారు. శనివారం ఆ భవనంలోకి ఓ గుర్తు తెలియని దుండగుడు ప్రవేశించాడని అందుకే మూసివేసినట్లు పోలీసులు చెప్పారు. పార్లమెంట్‌ హిల్‌లోని తూర్పు బ్లాక్‌లోకి అక్రమంగా వచ్చిన దుండగులు రాత్రంతా లోపలే ఉన్నాడని తెలిపారు. అతడి దగ్గర ఆయుధాలు ఉన్నాయా ? లేదా ? అనేదానిపై స్పష్టత లేదు.  ఇక వివరాల్లోకి వెళ్తే.. శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తి పార్లమెంటు భవనంలోకి చొరబడచంతో అధికారులు అలెర్ట్ అయ్యారు. 

Also Read: పంబన్ బ్రిడ్జ్ ప్రారంభించిన మోదీ.. భారత్‌లో ఇలాంటి వంతెన ఇదే ఫస్ట్ టైం

పార్లమెంటు భవనం చుట్టూ పోలీసులను మోహరించారు. తూర్పు బ్లాక్‌లో ఉన్న సిబ్బంది అందరూ ఒకే గదిలోకి వచ్చి తాళాలు వేసుకోవాలని సూచించారు. భవనంలో ఉన్న పలు ప్రదేశాలపై కూడా లాక్‌డౌన్ పెట్టారు. అలాగే పార్లమెంటుకు దగ్గర్లో ఉన్న రోడ్లని మూసివేస్తున్నామని.. ప్రజలు ఎవరూ కూడా అటువైపు రావొద్దని అధికారులు ఆదేశించారు. చివరికీ ఆదివారం ఉదయం దుండగుడిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం అతడిని విచారిస్తున్నట్లు చెప్పారు. 

ఏప్రిల్ 28న కెనడాలో ముందస్తు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కెనడా ప్రధాని మార్క్‌ కార్నీ గత నెల 23వ తేదీన పార్లమెంటును రద్దు చేశారు. వాస్తవానికి అక్కడ అక్టోబర్ 27న ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ దాదాపు ఆరు నెలలకు మందుగానే ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పార్లమెంటులోకి దుండగుడు ప్రవేశించడం కలకలం రేపుతోంది. అందులో ఉండే సున్నితమైన సమాచారాన్ని ఎత్తుకెళ్లడం కోసం దుండగులు వచ్చాడా ? అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది. 

Also Read: అమ్మో బాబోయ్.. చీతాలకు నీళ్లు తాగించిన యువకుడు.. చివరికీ ఊహించని షాక్

telugu-news | canada | rtv-news 

 

Advertisment
Advertisment
Advertisment