Weight Lose Tips : పిజ్జా తినండి.. బరువు తగ్గండి.. కానీ.. ఇలా చేస్తేనే! బయట తిన్నప్పుడు కూడా బరువు తగ్గవచ్చు, పొట్ట కొవ్వు పోతుందని నిపుణులు చెబుతున్నారు. 30 రోజులు చిన్న సైజు పిజ్జా తింటూ.. వ్యాయామంపై దృష్టి పెట్టాలంటున్నారు. ప్రతి వ్యక్తి ప్రతిరోజూ 8 గంటల వరకు మంచి నిద్రపోతే బరువు పెరగడానికి కారణమయ్యే ఒత్తిడి తగ్గుతుంది. By Vijaya Nimma 17 Feb 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Pizza Benefits : బరువు తగ్గడానికి(Weight Loss).. బయటి ఆహారం నిషేధించమని నిపుణులు చెబుతుంటారు. ఇష్టమైన ఆహారాన్ని పూర్తిగా వదలాలంటే కొంచం కష్టంగా ఉంటుంది. అయితే.. జంక్ ఫుడ్ ప్రియులను సంతోషపెట్టే విధంగా వ్యక్తిగత శిక్షకులు ఒక మాట చెబుతున్నారు. పిజ్జా(Pizza) తినడం వల్ల కేవలం నెల రోజుల్లోనే 6 కిలోల బరువు తగ్గానని, పొట్ట సన్నబడిందని సూచిస్తున్నారు. న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం.. బరువు తగ్గడానికి, జంక్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారాన్ని పూర్తిగా వదులుకోవాల్సిన అవసరం లేదంటున్నారు. బయట తిన్నప్పుడు కూడా బరువు తగ్గవచ్చు, పొట్ట కొవ్వు పోతుందని చెబుతున్నారు. కేలరీల లోటులోకి వెళ్లకూండా 30 రోజులు చిన్న సైజు పిజ్జా తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం. బరువు పరార్: ఈ కాలంలో.. ప్రతిరోజూ 2500 కేలరీలు మాత్రమే తీసుకుంటే సుమారు 6 కిలోల బరువు తగ్గుతారు. అందులో బొడ్డు కొవ్వు పోతుంది. నిద్ర కూడా మెరుగుపడటంతోపాటు శక్తి స్థాయి మెరుగుపడింది. ఈ ఆహారం బెస్ట్: పిజ్జాతో పాటు ఆహారంలో అధిక ప్రోటీన్, అధిక వాల్యూమ్, పోషకాహారం నిండిన ఆహారాలు తీసుకుంటే పొట్ట ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. శక్తికి లోటు ఉండదు. ఈ ఆహారాలలో అరటిపండు(Banana) ప్రోటీన్ పాన్‌కేక్‌లు, చాక్లెట్ ప్రోటీన్ వోట్స్, కూరగాయలతో గిలకొట్టిన గుడ్లు, అరటిపండు, ఎండుద్రాక్ష, వేరుశెనగ వెన్నతో కూడిన బేగెల్స్ తీసుకుంటే మంచిది. వ్యాయామం: బరువు తగ్గాలంటే ఏదైనా ప్రత్యేకమైన ఆహారాన్ని వదులుకోవడం కంటే వ్యాయామంపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. బరువు తగ్గించే రోజూకి 45-నిమిషాల అధిక-తీవ్రత వ్యాయామం చేయాలి. ఇందులో కార్డియో, కొన్నిసార్లు శక్తి శిక్షణ సంబంధించి కూడా ఉంటుంది. ప్రతీ రోజూ నడక(Daily Walk) మంచిదని నిపుణులు చెబుతున్నారు. నిద్ర: మంచి నిద్ర కూడా బరువు తగ్గటానికి ముఖ్య కారణం. ప్రతి వ్యక్తి ప్రతిరోజూ 7 నుంచి 8 గంటల వరకు మంచి నిద్రను తీసుకోవాలి. ఇది బరువు పెరగడానికి కారణమయ్యే ఒత్తిడి, అర్థరాత్రి కోరికల నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. అదనంగా, జీవక్రియ వేగవంతం అవుతుంది, ఎక్కువ కొవ్వు కరిగిపోతుందని చెబుతున్నారు. ఇది కూడా చదవండి: పచ్చి బొప్పాయిని వంటలో ఉపయోగించడం వల్ల కలిగే లాభాలు గమనిక : ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #health-tips #health-benefits #health-care #pizza #weight-lose మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి