RCB: ఈ మాత్రం దానికి అంత బిల్డప్‌లు ఎందుకు? అయినా మీరెప్పుడు గెలిచారులే!

చెపక్‌ స్టేడియంలో చివరిసారిగా 2008 మే 21న చెన్నైపై ఆర్‌సీబీ గెలిచింది. 16ఏళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు చెపక్‌ గడ్డపై బెంగళూరకు విక్టరీ లేదు. ఆర్‌సీబీ చివరిసారి చెపక్‌లో గెలిచిన సమయానికి సచిన్‌కు 81 సెంచరీలే ఉన్నాయి. కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుకూడా పెట్టలేదు.

New Update
RCB: ఈ మాత్రం దానికి అంత బిల్డప్‌లు ఎందుకు? అయినా మీరెప్పుడు గెలిచారులే!

IPL 2024: ఆర్‌సీబీ ఆటకు ఆ టీమ్‌ అభిమానులు ఇచ్చే బిల్డప్‌లకు అసలు పొంతన ఉండదు. ఒక్కసారి కూడా కప్‌లేదు కానీ చెన్నైతో ఫైట్‌ను ఎల్‌-క్లాసికోగా చెప్పుకుంటారు బెంగళూరు ఫ్యాన్స్‌. ఇప్పటివరకు ఈ రెండు జట్లు 32 సార్లు తలబడితే చెన్నై ఏకంగా 21 సార్లు గెలిచింది. అయినా బెంగళూరు ఫ్యాన్స్‌ మాత్రం చెన్నైకి తామే పోటి అని భ్రమల్లో బతుకుతుంటారు. అటు చెన్నైని అందరి కంటే ఎక్కువసార్లు ఓడించిన ముంబై ఫ్యాన్స్‌ మాత్రం ఆర్‌సీబీ సోషల్‌మీడియా పోస్టులు చూసి నవ్వుకుంటారు. ఇప్పటివరకు ముంబై వర్సెస్‌ చెన్నై ఎన్‌కౌంటర్లలో ముంబైదే పైచేయి. అటు ఇద్దరికి సమానంగా ఐదు ఐపీఎల్‌ టైటిల్స్‌ ఉన్నాయి. అందుకే ఈ రెండు జట్లతే ఐపీఎల్‌ అత్యుత్తమ పోరుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎల్‌-క్లాసికోకు అసలు అర్థం ఈ రెండు టీమ్‌ల మధ్య జరిగే టగ్‌ ఆఫ్‌ వారే. అటు బెంగళూరు అభిమానులు మాత్రం చెన్నైతో తలపడిన ప్రతీసారి బిల్డప్‌లకు పోతారు. తర్వాత ఓడిపోయాక సైలెంట్‌ అవుతారు. ఇక నిన్న చెపక్‌ స్టేడియంలో జరిగిన ఐపీఎల్‌-17 ఎడిషన్‌ తొలి మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఘోరంగా ఆడి ఓడిపోయింది. ఇది చెపక్‌ స్టేడయంలో బెంగళూరుకు వరుసగా 8వ ఓటమి.

16ఏళ్ల నుంచి గెలుపే లేదు:
చెపక్‌ స్టేడియంలో చివరిసారిగా 2008 మే 21న చెన్నైపై ఆర్‌సీబీ గెలిచింది. ఆ తర్వాత అసలు గెలవనే లేదు. ఆర్‌సీబీ చివరిసారి చెపక్‌లో గెలిచిన సమయానికి సచిన్‌కు 81 సెంచరీలే ఉన్నాయి. ఆ తర్వాత సచిన్‌ 100 సెంచరీలతో రిటైర్ అయ్యాడు. సచిన్ రిటైరై 11ఏళ్లు అవుతుంది. ఇక చెపక్‌లో చివరిసారి ఆర్‌సీబీ గెలిచిన సమయానికి విరాట్‌ కోహ్లీ ఇంకా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టలేదు. ఇప్పుడు సచిన్‌ రికార్డులను కోహ్లీ బ్రేక్‌ చేసినంత సమయం గడిచినా ఆర్‌సీబీ మాత్రం చెపక్‌లో చెన్నైపై గెలవలేకపోయింది. ఇక చెపక్‌ పిచ్‌పై ఆర్‌సీబీ విక్టరీ సమయానికి అనిల్‌కుంబ్లే భారత్‌ జట్టు టెస్టు కెప్టెన్‌గా ఉన్నాడు. లెజండరీ బౌలర్‌ జెమ్స్‌ అండర్సెన్‌ టెస్టు వికెట్ల సంఖ్య అప్పటికి 75 మాత్రమే.

ఇలా సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటివరకు చెపక్‌లో ఆర్‌సీబీ తలరాత మాత్రం మారలేదు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే ముందుగా బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 రన్స్ చేసింది. అనుజ్‌ రావత్‌, దీనేశ్‌ కార్తిక్‌ పోరాటంలో ఆర్‌సీబీ 173 రన్స్‌ చేయగలిగింది. అటు టార్గెట్‌ ఛేజింగ్‌లో చెన్నై ఆడుతూ పాడుతూ విక్టరీ కొట్టింది.

Also Read: ఇలా సింగిల్‌గా కప్‌లు గెలవడం మన వల్ల కాదు భయ్యా.. పొత్తులు పెట్టుకుంటే బెటర్!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Komatireddy Raj Gopal Reddy : నా మంత్రి పదవిని అడ్డుకుంటున్నది జానారెడ్డే...రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

కొంతకాలం నుంచి తనకు మంత్రి పదవి వస్తుందని ఆశిస్తోన్న మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఈ రోజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనకు ఎట్టి పరిస్థితుల్లో మంత్రి పదవి రాకుండా కొందరు ఢిల్లీస్థాయిలో కుట్రలకు తెర లేపారన్నారు.

New Update
Telangana Elections: అందుకే కాంగ్రెస్‌లోకి పోతున్నా.. కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

Komatireddy Raj Gopal Reddy

MLA Komatireddy Raj Gopal Reddy :గత కొంతకాలం నుంచి తనకు మంత్రి పదవి వస్తుందని వస్తుందని ఆశిస్తోన్న మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఈ రోజు సంచలన వ్యాఖ్యలు చేశారు.  చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారంలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పదవిపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు ఎట్టి పరిస్థితుల్లో మంత్రి పదవి రాకుండా కొందరు ఢిల్లీస్థాయిలో కుట్రలకు తెర లేపారని ఆరోపించారు. మంత్రి పదవి ఇస్తానని పార్టీ హామీ ఇచ్చిందని. తన మంత్రి పదవి విషయంలో కొందరు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.
జానారెడ్డి వంటివారు ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నారన్నారు.జానారెడ్డి 30 ఏళ్లపాటు మంత్రి పదవి అనుభవించారు.రంగారెడ్డి, హైదరాబాద్‌కు పదవి ఇవ్వాలని ఇప్పుడు గుర్తుకొచ్చిందా? అంటూ ప్రశ్నించారు.

Also Read :  కల్యాణ్‌రామ్‌ ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’ ట్రైలర్‌ చూశారా? కెవ్ కేక

 అధిష్టానం వద్ద తనకు మంత్రి పదవి ఖాయమైనా.. కావాలనే జానా పదేపదే అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. 25 ఏళ్లు మంత్రి పదవిలో జానారెడ్డి ఉన్నది సరిపోదా అని ధ్వజమెత్తారు. అధిష్టానం తనపై నమ్మకం ఉంచి మంత్రి పదవి ఇస్తే.. దాన్ని బాధ్యతగా భావిస్తానని కామెంట్ చేశారు. మంత్రి పదవి కోసం తాను ఎన్నడూ అడుక్కోలేదని.. మంత్రి పదవి అడుక్కుంటే వచ్చేది కాదు, అన్నదమ్ములు మంత్రులుగా ఉంటే తప్పేంటని ప్రశ్నించారు. సమర్థత ఉన్న నాయకులకు మాత్రమే మంత్రి పదవులు ఇవ్వాలంటూ రాజగోపాల్ రెడ్డి ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. కాగా తనకు మంత్రి పదవి అనగానే కొంతమంది భయపడుతున్నారని ఆయన అన్నారు. తనకు అధిష్ఠానం మంత్రి పదవి ఇస్తానంటే పార్టీలోని కొందరు సీనియర్ నేతలకు చెమటలు పడుతున్నాయన్నారు. 

Also Read :  'చూపుల్తో గుచ్చి గుచ్చి’ మాస్ జాతర ప్రోమో సాంగ్ అదిరిపోయిందిగా..!
 
అయితే మంత్రి వర్గ విస్తరణపై సీనియర్ నేత జానారెడ్డి అధిష్ఠానానికి లేఖ రాశారు. మంత్రివర్గ కూర్పులో సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకోవాలని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. మంత్రి పదవుల ఎంపికలో అనుభవం, ఆయా నాయకుల సామర్థ్యాన్ని ప్రామాణికంగా తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జానారెడ్డిపై సంచలన కామెంట్స్ చేశారు.

Also Read :  ట్రెడిషనల్ లుక్ తో కట్టిపడేసిన మిల్కీబ్యూటీ..

అధిష్టానం తనపై నమ్మకం ఉంచి మంత్రి పదవి ఇస్తే.. దాన్ని బాధ్యతగా భావిస్తానని కామెంట్ చేశారు. మంత్రి పదవి కోసం తాను ఎన్నడూ అడుక్కోలేదని.. అన్నదమ్ములు మంత్రులుగా ఉంటే తప్పేంటని ప్రశ్నించారు. సమర్థత ఉన్న నాయకులకు మాత్రమే మంత్రి పదవులు ఇవ్వాలంటూ రాజగోపాల్ రెడ్డి ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. కాగా తనకు మంత్రి పదవి అనగానే కొంతమంది భయపడుతున్నారని ఆయన అన్నారు.

Also Read :  'సూర్య 45'లో మలయాళ బ్యూటీ అనఘా రవి

Advertisment
Advertisment
Advertisment