West Bengal: పశ్చిమ బెంగాల్‌లో దారుణం.. సాధువులను చితకబాదిన స్థానికులు.. పశ్చిమ బెంగాల్‌లో యూపీకి చెందిన ముగ్గురు సాధువులు కిడ్నాపర్లు అనుకొని వారిపై స్థానికులు దాడి చేయడం రాజకీయంగా దుమారం రేపింది. అయితే వాళ్లు కిడ్నాపర్లు కాదని పోలీసులు నిర్దారించడంతో టీఎంసీ పార్టీపై బీజేపీ తీవ్రంగా విమర్శలు చేసింది. By B Aravind 13 Jan 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Sadhus Attacked in West Bengal: పశ్చిమ బెంగాల్‌లో మళ్లీ ఉద్రిక్తతలు చోటుచేసుకోవడం కలకలం రేపింది. గురువారం ముగ్గురు సాధువులపై పురులియ జిల్లాలో కొందరు దాడి చేసిన చేసిన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌కు (UP) చెందిన ముగ్గురు సాధువులు సంక్రాతి పండుగ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లోని గంగాసాగర్ మేళాకు బయలుదేరారు. అయితే అలా వెళ్తుండగా మధ్యలో వారికి దారి తెలియకపోవడంతో పురులియా జిల్లాలో వాహనం ఆపారు. ఇద్దరు అమ్మాయిలను దారి అడిగారు. Also read: ‘INDIA’కూటమి చైర్‌పర్సన్‌గా ఖర్గే..! కానీ వాళ్లని చూడగానే ఆ అమ్మయాలు భయపడి పారిపోయారు. వాళ్లు అలా పారిపోవడాన్ని గమనించిన స్థానికులు ఆ సాధువులను కిడ్నాపర్లు అని అనుకుని వాళ్లపై దాడికి పాల్పడ్డారు. చివరికి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఆ ముగ్గురు సాధువులను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారణ చేశారు. అయితే వారు కిడ్నాపర్లు కాదని పోలీసులు నిర్ధారించారు. దీంతో వాళ్లపై దాడికి పాల్పడ్డ 12 మందిని అరెస్టు చేశారు. ఆ తర్వాత ఈ ఘటనపై బీజేపీ (BJP) స్పందించడం రాజకీయంగా దుమారం రేపింది. తృణమూల్ కాంగ్రెస్ (TMC) ప్రభుత్వంపై కమలం పార్టీ విమర్శలు గుప్పించింది. గంగాసాగర్‌కు వెళ్తున్న సాధువులను దారుణంగా కొట్టారని.. టీఎంసీ పార్టీ మద్ధతుగా కొందరు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని మండిపడింది. ఈ ఘటనపై రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) స్పందించకుండా ఉండటం సిగ్గుచేటంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. Absolutely shocking incident reported from Purulia in West Bengal. In a Palghar kind lynching, sadhus traveling to Gangasagar for Makar Sankranti, were stripped and beaten by criminals, affiliated with the ruling TMC. In Mamata Banerjee’s regime, a terrorist like Shahjahan Sheikh… pic.twitter.com/DsdsAXz1Ys — Amit Malviya (@amitmalviya) January 12, 2024 Also read: ఉప్పొంగుతోన్న భక్తిపారవశ్యం.. అయోధ్య కోసం సెర్చ్ చేస్తున్న కోట్లాది మంది భారతీయులు..!! #telugu-news #national-news #bjp #west-bengal #tmc మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి