Andhra Pradesh: అసెంబ్లీ సమావేశాలపై జగన్‌కు నో ఇంట్రెస్ట్.. పార్టీ నేతలకు ఏం చెప్పారంటే? ఏపీలో శుక్రవారం జరగనున్న అసెంబ్లీ సమావేశానికి వైసీపీ చీఫ్ జగన్ ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. కౌరవులు ఉన్న సభకు వెళ్లి అక్కడ మనం ఏదో చేస్తామన్న నమ్మకం లేదని పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన అన్నట్లు సమాచారం. By B Aravind 20 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు New Update షేర్ చేయండి ఏపీలో శుక్రవారం అసెంబ్లీ సమావేశం జరగనుంది. ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే వైసీపీ చీఫ్, మాజీ సీఎం జగన్ ఈ సమావేశానికి హాజరయ్యేందుకు ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పలు కీలక వాఖ్యలు చేశారు. ' మనకు సంఖ్యా బలం తక్కువే కాబట్టి.. అసెంబ్లీలో మనం చేసేది తక్కువే. స్పీకర్‌గా ఎంపిక కాబేయే వ్యక్తి మాట్లాడుతున్న మాటలు చూస్తున్నాం. Also Read: ప్లీజ్.. మమ్మల్ని విధుల్లోకి తీసుకోండి.. వాలంటీర్ల ఆందోళన.! జగన్ ఓడిపోయాడు కానీ.. చనిపోలేదని ఒకడంటాడు. చచ్చేదాకా కొట్టాలని మరొకడంటాడు. ఇలాంటి కౌరవులు ఉన్న సభకు మనం వెళ్లాల్సి ఉంటుంది. ఇలాంటి వ్యక్తుల మధ్య అసెంబ్లీలో మనం ఏదో చేస్తామన్న నమ్మకం లేదు. అధికార పక్షం పాపాలు పండేకొద్దీ ప్రజలతో కలిసి పోరాడే సందర్భాలు వస్తాయని' జగన్ అన్నారు. Also Read: ఇరిగేషన్ వ్యవస్థ నిర్వీర్యం.. సాగునీటి కోసం రైతులు కన్నీళ్లు: ఎస్సీ రాంబాబు #andhra-pradesh #telugu-news #jagan #ysrcp మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి