ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో వైయస్ షర్మిల ప్రజా ప్రస్థానం

తెలంగాణ రాష్ట్రంలో 3,800 కిలోమీటర్లు పాదయాత్ర చేసినందుకు YSR తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నారు. 3800 కిలో మీటర్లు పాదయాత్ర చేసిన మొట్టమొదటి మహిళగా వైయస్ షర్మిల ఈ రికార్డును సృష్టించారు. ఈ సందర్భంగా ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు వైయస్ షర్మిలని కలిసి అభినందించి అవార్డును ప్రదానం చేశారు.

New Update
ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో వైయస్ షర్మిల ప్రజా ప్రస్థానం

షర్మిలకు అవార్డును ప్రదానం ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు

2021 అక్టోబర్​ 21న వైఎస్ షర్మిల తన ప్రజాప్రస్ధాన యాత్రను చేవెళ్ల నుంచి ప్రారంభించారు. ఈ యాత్రలో ఆమెకు ఎన్ని అడ్డంకులు వచ్చిన వాటిని ఎదుర్కొని కొనసాగించారు. వరంగల్​ జిల్లాలో ఎన్ని ఉద్రిక్తత పరిస్థితులు వచ్చిన కోర్టుకు వెళ్లి మరీ.. అనుమతులు తెచ్చుకొని పాదయాత్ర కొనసాగించారు. దాదాపు సంవత్సరం ఆరు నెలలు ఈ యాత్ర కొనసాగింది. దీంతో తన యాత్రను గుర్తించిన ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు లోటస్ పాండ్​లోని వైఎస్​ఆర్​ తెలంగాణ పార్టీ కార్యాలయంలో షర్మిలను కలిసి అభినందించారు. అనంతరం అవార్డును ప్రదానం చేశారు. అయితే కేసీఆర్​ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే ఉద్దేశంతో షర్మిల ప్రజాప్రస్థాన యాత్ర పేరుతో పాదయాత్ర చేసింది.

ప్రజాప్రస్థాన పాదయాత్రలో ఆమె బీఆర్​ఎస్​ ముఖ్యమంత్రి కేసీఆర్​, మంత్రులు, ఎమ్మెల్యేలపై కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో కొన్నిచోట్ల ఆమె యాత్రకు పోలీసులు ఆటంకం కలిగించారు. మరికొన్ని సార్లు జైలుకి వెళ్లారు. అయినా ఆమె పట్టు వదలని విక్రమార్కునిలా పాదయాత్రను కొనసాగించింది. ఇటీవలే వైఎస్సార్​ పుట్టినరోజు సందర్భంగా పాలమూరులో మరల తన పాదయాత్రను త్వరలో మొదలు పెడతానని ప్రకటించారు. గతంలో ఏపీలోనూ పాదయాత్ర చేసినా.. తెలంగాణలో చేసినంత సుదీర్ఘంగా చేయలేదు.

కేసీఆర్ పాలనకు చరమ గీతం పాడాలని షర్మిల ఆకాంక్ష

ఇవాళ హైదరాబాద్​లోని వైఎస్​ఆర్​టీపీ కార్యాలయంలోని 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో వైఎస్​ షర్మిల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భిన్నత్వంలో ఏకత్వం భారతదేశం గొప్పదనమని అన్నారు. ఎన్నో కులాలు, ఎన్నో మతాలు, ఎన్నో భాషలు కలిసిమెలిసి జీవిస్తుండడం దేశ గౌరవమని తెలిపారు. ప్రస్తుతం కేంద్రప్రభుత్వం బ్రిటీష్​ వారు ఆచరించిన డివైడ్​ అండ్​ రూల్​ పద్దతిలో పాలన సాగుతుందని విమర్శించారు. మణిపూర్​లో మహిళలపైన అల్లర్లు ఇంకా కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాదితో కేసీఆర్ పాలనకు చరమ గీతం పాడాలని షర్మిల ఆకాంక్షించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు