/rtv/media/media_files/2025/03/07/Nw15Nc2ASQScf8YU8g48.jpg)
murder plan with knife
డబ్బు కోసం రక్తసంబంధీకులను కూడా చంపడానికి వెనుకాడటం లేదు. తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, చెల్లె, అక్క ఇలా బంధాలకు చరమగీతం పాడి మనిషిని అతి కిరాతకంగా హత్య చేయడానికి సిద్ధమవుతున్నారు. అలాంటి సంఘటనే కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఆస్తి కోసం సొంత అన్న, అన్న కొడుకును చంపడానికి తమ్ముడు ఏకంగ రూ.23 లక్షల సుఫారి ఇచ్చాడంటే మానవ సమాజం ఎంతకు దిగజారిందో అంచనా వేయవచ్చు.వివరాల్లోకి వెళ్తే...
ఇది కూడా చూడండి: VIRAL VIDEO: కన్నీరు పెట్టిస్తున్న బాల్య వివాహం.. రానంటున్నా భుజంపై ఎత్తుకుని తీసుకెళ్లిన వరుడు!
కర్ణాటక రాష్ట్రంలోని చిత్రదుర్గ జిల్లా మొలకాల్మూరు తాలూకా కెరెకొండాపుర గ్రామానికి చెందిన మధుసూదన్ గౌడ్… దామోదర్ గౌడ్ అన్నదమ్ములు. ఆస్తులు విషయంలో అన్నదమ్ముల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఆస్తులు గొడవల్లో అన్నతో పాటు ఆయన కొడుకు భార్గవ్ లు కలిసి దామోదర్ గౌడ్ ను కొట్టారు. దీంతో అవమానభారం తట్టుకోలేక అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. తన అన్న మధుసూదన్ గౌడ్, అన్న కొడుకు భార్గవ్ ను కడతేర్చితే రూ.12 కోట్ల ఆస్తి తనకే దక్కుతుందని దామోదర్ గౌడ్ స్కెచ్ వేశాడు.దానికోసం సుఫారి గ్యాంగ్ ల కోసం అన్వేషించాడు.
ఇది కూడా చూడండి: SVSC Re Release: థియేటర్ లో పూలకుండీ సీన్ రిక్రియేషన్.. SVSC రీరిలీజ్ హంగామా!
అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం మెచ్చిరి గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ఆది కేశవులు హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మారుతి రెడ్డిని తమ్ముడు దామోదర్ గౌడ్ సంప్రదించాడు. తన అన్నతో పాటు అన్న కొడుకును హత్య చేసేందుకు సుఫారి కుదుర్చుకున్నాడు. హత్య చేసేందుకు రూ. 23 లక్షలకు మారుతి రెడ్డితో ఒప్పందం చేసుకున్నాడు. మూడు లక్షలు అడ్వాన్స్ గా ఇవ్వడంతో పాటు, మూడు వేటకోడవళ్ళు, ఓ కారు సమకూర్చాడు. అనుకున్న ప్లాన్ ప్రకారం మధుసూదన్ గౌడ్ ఆయన కొడుకు భార్గవ్ ను హత్య చేసేందుకు కారులో బయలుదేరిన సుపారి కిల్లర్ మారుతి రెడ్డి, దామోదర్ గౌడ్ లు రాయదుర్గం పోలీసులు పల్లెపల్లి వద్ద వాహనాల తనిఖీల్లో దొరికారు. అనుమానంతో విచారించగా హత్య కుట్ర వెలుగులోకి వచ్చింది.
Also read: Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. అన్నప్రసాదంలో మరో స్పెషల్ ఐటెమ్
నిందితులు కారులో వేటకొడవళ్ళు దొరకడంతో కథ అంతా రివర్స్ అయింది. సొంత తమ్ముడే.. అన్న, అన్న కొడుకును ఆస్తికోసం సుపారి మర్డర్కు ప్లాన్ చేశాడని పోలీసులు గుర్తించారు. సుఫారి కిల్లర్ మారుతీ రెడ్డి… తమ్ముడు దామోదర్ గౌడ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు… వారి వద్ద నుంచి 3 లక్షల రూపాయల నగదు… మూడు వేట కొడవళ్ళు, కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలా ఆస్తికోసం అన్నని హత్య చేయాలనుకున్న తమ్ముడి కుట్రను రాయదుర్గం పోలీసులు భగ్నం చేశారు.
Also Read : సీఎం కేసీఆర్.. రేవంత్ పేరు మళ్లీ మర్చిపోయిన మంత్రి పొన్నం, ఎమ్మెల్యే రాందాస్!