Telangana: దసరా నుంచే స్కిల్ యూనివర్సిటీ ప్రారంభం: సీఎస్ శాంతి కుమారి యంగ్ ఇండియా స్కిల్ యూనిర్సిటీలో తొలుత ఆరు కోర్సులను దసరా పండుగ నుంచే ప్రారంభించనున్నామని సీఎస్ శాంతి కుమారి వెల్లడించారు. ప్రస్తుతం ముచ్చర్లలో జరుగుతున్న వర్సిటీ నిర్మాణ పనులు ముగిసేవరకు తాత్కాలిక భవనంలో ఈ కోర్సులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. By B Aravind 17 Aug 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలో నిర్మిస్తున్న యంగ్ ఇండియా స్కిల్ యూనిర్సిటీలో పలు కోర్సులను దసరా పండుగ నుంచి ప్రారంభిస్తున్నట్లు సీఎస్ శాంతి కుమారి వెల్లడించారు. ఈ యూనివర్సిటీలో దాదాపు 20 కోర్సులు నిర్వహించనున్నామని.. వీటిలో ఆరు కోర్సులు దసరా నుంచి ప్రారంభించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. శనివారం ఆమె అధికారులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. " ముచ్చర్ల వద్ద కేటాయించిన 57 ఎకరాల స్థలంలో ఈ స్కిల్ యూనివర్సిటీ పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన చేశారు. ఈ నిర్మాణ పనులు ముగిసేవరకు ఈ యూనివర్సిటీని తాత్కాలిక భవనంలో నడిపిస్తారు. ఇప్పటికే వర్సిటీ ఛైర్మన్‌గా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాను, కో-ఛైర్మన్ శ్రీనివాస సి.రాజును నియమించడం జరిగింది. Also Read: బీజేపీలో అయోమయం.. ఈటల VS కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఈ యూనివర్సిటీలో దాదాపు 140 కంపెనీలు భాగస్వామ్యం కావడానికి ఆసక్తి చూపుతున్నాయి. దాదాపు 20 కోర్సులను ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందించారు. తొలుత స్కూల్ ఆఫ్ ఈ-కామర్స్, లాజిస్టిక్స్ రిటైల్ విభాగంలో సర్టిఫికెట్ కోర్స్‌లు, డిప్లొమా కోర్సులను ప్రారంభించనున్నాం. వివిధ విభాగాల్లో శిక్షణ నిమిత్తం దేశంలోని ప్రముఖ కార్పొరేట్ సంస్థలైన SBI, NAC , Dr. Reddy's ,TVAGA , ADAANI, CII లు భాగస్వాములుగా ఉండేందుకు ముందుకు వచ్చాయని" శాంతి కుమారి అన్నారు. అలాగే ఈ వర్సిటీకి సంబంధించిన లోగోను, వెబ్‌సైట్‌ను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇందులో కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు ఆకర్షణీయమైన వేతనంతో కూడిన ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ @Revanth_Anumula గారి ఆలోచనలమేరకు రూపుదిద్దుకున్న ‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ’ ద్వారా పలు రంగాల్లో కోర్సులను దసరా పండగ నుండి ప్రారంభిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి వెల్లడించారు.#YoungIndiaSkillUniversity pic.twitter.com/HpeXoxCasP — Office of Chief Secretary, Telangana Govt. (@TelanganaCS) August 17, 2024 #telugu-news #telangana #cs-shanti-kumari #skill-university మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి