Health Tips: వందేళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆసనాలు వేయాల్సిందే

మానసిక ఒత్తిడి, ఎన్నో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలని నిపుణులు అంటున్నారు. కనీసం రోజుకు 30 నిమిషాలైనా యోగా చేస్తేనే వీటి నుంచి విముక్తి లభిస్తుందంటున్నారు. యోగా చేయడం వల్ల కడుపు చుట్టూ ఉన్న కొవ్వు తగ్గుతుంది.

New Update
Health Tips: వందేళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆసనాలు వేయాల్సిందే

Health Tips: ప్రస్తుతకాలంలో అనేక మంది మానసిక ఒత్తిడి, ఎన్నో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వీటి నుంచి విముక్తి లభించాలంటే మీ జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలని నిపుణులు అంటున్నారు. కనీసం రోజుకు 30 నిమిషాలైనా యోగా చేయాలని చెబుతుంటారు. ఎందుకంటే యోగా చేయడం వల్ల కడుపు చుట్టూ ఉన్న కొవ్వు తగ్గుతుందని, పాంక్రియాస్‌ని ప్రోత్సహిస్తుందని, షుగర్‌ ఉన్నవారికి కూడా చాలా మంచిదని సలహా ఇస్తున్నారు.

యోగా వల్ల ఉపయోగాలు:

  • కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. నడుము భాగాన్ని ఉత్తేజితం చేస్తుంది. అవయవాల పనితీరును క్రమపరుస్తుంది. రక్తపోటు కంట్రోల్‌లో ఉంటుంది. అలాగే శరీరానికి నూతనోత్సాహం కలుగుతుంది. కీళ్లను హెల్తీ గా ఉంచుతుంది. యోగా ఒత్తిడిని తగ్గించడంలో ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

వజ్రాసనం:

  • ఈ ఆసనం నడుము నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. వెన్ను కింద ఉండే కండరాలు బలోపేతం అవుతాయి. పలు గ్యాస్‌ సమస్యలను దూరం చేస్తుంది. హార్ట్ ఎటాక్ ప్రాబ్లమ్స్, చీలమండ, పాదాల నొప్పులతో బాధపడుతున్నవారు ఈ ఆసనం వేస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. అలాగే వజ్రాసనం జీర్ణ వ్యవస్థకు బాగా ఉపయోగపడుతుంది. భోజనం తర్వాత వజ్రాసనం వేయడం వల్ల తొందరగా జీర్ణం అవుతుంది. ఈ ఆసనాన్ని మోకాళ్లపై కూర్చుని 5 నిమిషాల పాటు చేయాలి.

ధనురాసనం:

  • శరీరాన్ని విల్లులా వంచి చేసే ఆసనం ధనురాసనం. ఓ పద్ధతిలో శరీరాన్ని వెనుకకు వంచి పాదాలను చేతుల్తో పట్టుకుని ఈ ఆసనాన్ని వేయాలి. దీని కంటే ముందుగా చదునైన స్థలంలో చాప లాంటిది వేసి ఈ ఆసనాన్ని చేయాలి. ఈ ఆసనం చేయడం వల్ల మధుమేహం, వెన్ను నొప్పి వంటి వ్యాధులకు పూర్తిగా చెక్ పెట్టవచ్చు. అంతేకాకుండా అజీర్ణ సమస్యలను దూరం చేస్తుంది.

పద్మాసనం:

  • పద్మాసనంలో మొదట రెండు కాళ్ళు చాపి నేలపై ఉంచాలి. తర్వాత ఎడమ కాలును కుడి తొడపై పెట్టుకోవాలి, కుడి కాలును ఎడమ తొడపై పెట్టాలి. రెండు చేతులను మోకాళ్ళపై ఉంచాలి. వెన్నెముక నిటారుగా ఉండేలా చూసుకోవాలి. ఏకగ్రతతో 5 నిమిషాల పాటు పద్మాసనం చేయాలి. నెమ్మదిగా 20-25 నిమిషాల వరకు ఈ ఆసనాన్ని వేయడానికి ట్రై చేయాలి. ప్రతి రోజూ పద్మాసనం చేస్తే రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవచ్చు. అలాగే స్ట్రెస్, మలబద్ధకం, మైగ్రేన్, హార్ట్ ఎటాక్, అజీర్ణం సమస్యలకు చెక్ పెట్టొచ్చు. నత్తిగా మాట్లాడే వారు ఈ ఆసనం చేస్తూ ఓం మంత్రాన్ని జపిస్తే ప్రయోజనం ఉంటుందని నిపుణులు అంటున్నారు.

ఇది కూడా చదవండి : అనుమానం వద్దు.. నమ్మకమే ముద్దు.. మీరు అలా చేయకండి!

గమనిక :ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
తాజా కథనాలు