Uttarakhand:ఇవాళ అయినా టన్నెల్ నుంచి కార్మికులు బయటకు వస్తారా?

New Update
Uttarakahnd:ఉత్తరాఖండ్ సొరంగంలో మళ్ళీ ఆగిన డ్రిల్లింగ్ పనులు

ఉత్తరాఖండ్ లో సొరంగం మూసుకుపోవడంతో 12 రోజులుగా అందులో 41 మంది కార్మికులు చిక్కకుపోయారు. వాళ్ళను బయటకు తీసుకురావడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. కానీ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. లోపల ఉండిపోయిన కార్మికులు ప్రస్తుతానికి బాగానే ఉన్నారు. కానీ వారిని వీలయినంత వెంటనే తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది. టన్నెల్ పైన ఉన్న కొండ మీద నుంచి డ్రిల్లింగ్ చేస్తున్నారు. అక్కడ కన్నం పెట్టి దానిలోకి పెద్ద పైపం పంపించడం ద్వారా కార్మికులను బయటకు తీసుకురావాలని ప్లాన్. కానీ దేనితో అయితే సొరంగాన్ని తవ్వుతున్నారో దానికే ప్రాబ్లెమ్ రావడంతో డ్రిల్లింగ్ పనులను ఎక్కడిక్కడే ఆపేశారు. 25 టన్నుల బరువైన భారీ డ్రిల్లింగ్‌ మెషీన్‌ అమర్చిన వేదికకు పగుళ్లు రావడంతో డ్రిల్లింగ్‌ను ఆపేశారు. వేదిక సరిగా లేకుంటే డ్రిల్లింగ్‌ మెషీన్‌ అటుఇటూ కదులుతూ కచ్చితమైన దిశలో డ్రిల్లింగ్‌ అవదు. ఎలా పెడితే అలా డ్రిల్లింగ్ చేస్తే అసలుకే మోసమొస్తుంది. అందుకే ముందుజాగ్రత్తగా డ్రిల్లింగ్‌ను ఆపేశారు.

Also Read:రాజస్థాన్ లో పోలింగ్ షురూ..సాయంత్రం ఆరు వరకు పోలింగ్

అయితే ఆ డ్రిల్లింగ్ పనులను నిన్న పునరుద్ధరించారు. సాంకేతిక సమస్యలను సరిచేసి డ్రిల్లింగ్ కంటిన్యూ చేశారు. కానీ గంటలోనే మళ్ళీ అంతరాయం ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. శిథిలాల మధ్యలో నుంచి టన్నెల్ లోకి స్టీల్ పైపులను పంపించి వాటి గుండా కార్మికులను బయటకు తీసుకువచ్చే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. నిన్నటి సమస్యలు ఈరోజు ఎదురు కాకపోవచ్చునని...మిగిలి ఉన్న 5.4 మీటర్ల శిథిలాలు తవ్వేందుకు అవరోధాలు ఎదురుకాకపోవచ్చునని అంటున్నారు. ప్రత్యేక రాడార్ ద్వారా అంతా పరిశీలించామని తెలిపారు. కార్మికులు బయటకు రాగానే పరీక్షలు నిర్వహించి గ్రీన్ కారిడార్ ద్వారా హాస్పట్ల్స్ కు తరలిస్తామని చెప్పారు.

Also Read:మాంసాహార ప్రియులకు షాక్..నేడు నాన్ వెజ్ షాపులన్నీ మూసివేయాలని సర్కార్ ఆదేశం..!!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Renu Desai: నాకు రాజకీయాల్లోకి రావాలని ఉంది..రేణూ దేశాయ్

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. దేశంలో జరిగే అన్ని విషయాలపైనా స్పందిస్తూ ఉంటారు. తాజాగా ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె..తనకు రాజకీయాల్లోకి రావాలని ఉందని చెప్పారు. 

New Update
Renu Desai

Renu desai

తనకు రాజకీయాల్లోకి వెళ్ళే అవకాశం ఇంతకు ముందే వచ్చిందని..కానీ పిల్లలు చిన్నవారు కావడం వలన వదులుకున్నానని చెప్పారు రేణూ దేశాయ్. రాజకీయాల్లోకి వెళ్ళడం తన జాతకంలోనే ఉందని అన్నారు. ఇప్పటికీ తనకు అదే కోరికని...కానీ తాను విధి రాతకు వ్యతిరేకంగా ప్రయాణిస్తున్నానని చెప్పుకొచ్చారు రేణు. ఓ పాడ్ కాస్ట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులో మాటను బయటపెట్టారు.  సామాజిక సేవ చేయడం అంటే తనకు ఆనందమని...ఏ చిన్నారీ ఆకలితో ఉండకూడదని అనుకుంటానని ఆమె తెలిపారు. అయితే తాను కొంచెం ముక్కు సూటి మనిషిని...స్నేహితులు, పిల్లలతో ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తానని...అందుకే వారు తాను పోలిటిక్స్ లో పనికి రానని అంటారని నవ్వూతూ చెప్పారు రేణూ దేశాయ్. 

మోడీ భక్తురాలిని..బీజేపీకే సపోర్ట్..

తాను ఎప్పటికీ మోడీనే సపోర్ట్ చేస్తానని...ఆమె భక్తురాలిని అని నిర్భయంగా చెప్పుకున్నారు రేణు. మన ధర్మం ఎలా బతకాలో, ఎలా నడుచుకోవాలో నేర్పించింది. అందుకే నేను సనాతురాలినే అని చెప్పుకుంటాననన్నారు ఎవరేం అనుకున్నా ఎప్పటికీ తాను బీజేపీకే సపోర్ట్ చేస్తానని చెప్పుకొచ్చారు. భవిష్యత్తులా తాను ఏదైనా పార్టీలో చేరితే కచ్చితంగా అందరికీ చెప్పే చేస్తానని రేణూ దేశాయ్ అన్నారు. ఇక ఆమె కుమారుడు అకీరా నందన్ గురించి చెబుతూ...ఓజీ సినిమాలో అతను పని చేయడం లేదని తెలిపారు. అకీరా నటన గురించి ఆలోచించిన రోజే నా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెడతా. కొందరు యూట్యూబర్లు మనీ కోసం తప్పుడు థంబ్‌నైల్స్‌ పెడుతున్నారు రేణూ ఆరోపించారు. 

today-latest-news-in-telugu | renu-desai | actress | inter-view

Also Read: WHO: మరో మహమ్మారి తప్పదు-WHO చీఫ్

Advertisment
Advertisment
Advertisment