Telangana: అమ్మాయిలూ మీ కోసమే ఈ యాప్..టీ సేఫ్

తెలంగాణలో అమ్మాయిల భద్రత కోసం ఒక యాప్ ఉందని మీకు తెలుసా..మార్చి 12, 2024న మహిళల భద్రత కోసం సీఎం రేవంత్ రెడ్డి టీ సేఫ్ యాప్ లాంచ్ చేశారు. ఇప్పటివరకు 15 వేల మంది డౌన్ లోడ్ చేసుకున్న ఈ యాప్ మహిళల ప్రయాణ సమయంలో, పని ప్రాంతాల్లో వారి భద్రత కోసం పనిచేస్తోంది.

New Update
Telangana: అమ్మాయిలూ మీ కోసమే ఈ యాప్..టీ సేఫ్

T-Safe App: కోలకత్తా సంఘటన తర్వాత మహిళ భద్రత మీద మరోసారి అందరికీ జాగ్రత్త పెరిగింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఉన్న టీ సేఫ్ యాప్‌ ను మరోసారి గుర్తు చేసింది ప్రభుత్వం. పని ప్రాంతాల్లో , ప్రయాణాల్లో స్త్రీలకు ఈ యాప్ రక్షణ కవచంలా పని చేస్తుంది. అపాయంలో ఉన్న మహిళలను గుర్తించి వెంటనే పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకునేలా ఇది పనిచేస్తోంది. ఒక్క స్మార్ట్ ఫోన్ లోనే కాకుండా, సాధారణ ఫోన్ల ద్వారా కూడా టీ సేఫ్ వాడొచ్చు.

ప్రస్తుతం హీరో మాధవన్ ఈ టీ సేఫ్ యాప్‌ను తన ఎక్స్‌లో ప్రస్తావించారు. మహిళల భద్రత కోసం పని చేస్తున్న ఈ యాప్‌ను ఆయన కొనియాడారు. మరోవైపు మంత్రి సీతక్క కూడా టీ సేఫ్ యాప్ గురించి మరోసారి గుర్తుచేశారు. అమ్మాయిలు, మిళలు దీనిని వినియోగించాలని సూచించారు. దాంతో పాటూ టీ సేఫ్‌ ప్రజల్లోకి చేరేవిధంగా కృషి చేయాలని ఆమె అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక టీ సేఫ్ యాప్ ను తమ రాష్ట్రంలో ప్రారంభించేందుకు ఏడు రాష్ట్రాలు ముందు కొచ్చాయి.

చాలా మంది టీ సేఫ్ గురించి తెలియక దానిని డౌన్‌ లోడ్‌ చేసుకోలేదు. ప్రస్తుతం పరిస్థితులు చాలా సున్నితంగా ఉన్న తరుణంలో ఇలాంటి యాప్‌లు మహిళలకు చాలా అవసరం అని మంత్రి సీతక్క అన్నారు. ఈరోజుల్లో ఏ పనీ చేయకుండా ఇంట్లో కూర్చోవడం సాధ్యం కాదు. బయటకు వెళ్ళి పని చేయక తప్పని పరిస్థితులు చాలా మందికి ఉంటున్నాయి. అలాంటివారికిఈ టీ సేఫ్ యాప్ చాలా ఉపయోగపడుతుందని మంత్రి చెప్పారు.

Also Read: 45 ఏళ్ళలో మొదటిసారి పోలాండ్‌లో అడుగుపెట్టిన ప్రధాని

Advertisment
Advertisment
తాజా కథనాలు