Maharastra: కారు రివర్స్ చేస్తూ కొండ మీద నుంచి పడిపోయిన మహిళ

మహారాష్ట్రలో అనుకోకుండా జరిగిన ఓ సంఘటన అక్కడి వారిని విషాదంలో ముంచేసింది. కొండనై నుంచి కారు రివర్స్ చేస్తూ 300 అడుగుల లోయలో పడి ఓ అమ్మాయి మరణించింది. దీని తాలూకా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

New Update
Maharastra: కారు రివర్స్ చేస్తూ కొండ మీద నుంచి పడిపోయిన మహిళ

Car Accident: శ్వేతా దీపక్ సుర్వాసే, ఆమె ఫ్రెండ్ సూరజ్ ఇద్దరూ కలిసి ఔరంగాబాద్‌లోని సులిభంజన్ హిల్స్‌కు వెళ్ళారు. అక్కడ ఉన్న ఆలయం దర్శనం చేసుకుని కాసేపు టైమ్ స్పెండ్ చేశారు. దీని తర్వాత శ్వేతా డ్రైవింగ్ నేర్చుకుంటానంటే సూరజ్ ఆమెకు కారును ఇచ్చాడు. తాను వీడియో తీస్తూ ఉన్నాడు. శ్వేతా కారు నడుపుతూ కొండ ఎక్కించింది. కొండ ఇంకా 50 మీటర్ల దూరంలో ఉందనగా ఆమె కారును రివర్స్ చేయడానికి ప్రయత్నించింది. పక్కనుంచి ఆమె స్నేహితుడు స్లో, స్లో అని చెబుతూనే ఉన్నాడు. క్లచ్ పట్టుకో అని అరుస్తూనే ఉన్నాడు. కానీ శ్వేత కారు రివర్స్ చేయడంలో ఆక్సిలరేటర్‌ మీద కాలు వేసింది. అది కాస్తా స్పీడ్ అయిపోయి వేగంగా కిందికి వెళ్ళి లోయలో పడిపోయింది. అంతే కారు 300 అడుగుల లోయలోకి అత్యంత వేగంగా జారిపోయింది.

లోయలోకి పడిపోయిన కారు తుక్కు తక్కు అయిపోయింది. అంతా చూస్తుండగా జరిగిపోయింది. కారులో ఉన్న శ్వేత కూడా చనిపోయింది. ఇదంతా సూరజ్ తీస్తున్న వీడియోలో రికార్డ్ అయింది.

Also Read:Ambani Wedding: జూన్ 29 నుంచి జూలై 14 వరకు అంబానీ ఇంట పెళ్ళి వేడుకలు..

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Renu Desai: నాకు రాజకీయాల్లోకి రావాలని ఉంది..రేణూ దేశాయ్

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. దేశంలో జరిగే అన్ని విషయాలపైనా స్పందిస్తూ ఉంటారు. తాజాగా ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె..తనకు రాజకీయాల్లోకి రావాలని ఉందని చెప్పారు. 

New Update
Renu Desai

Renu desai

తనకు రాజకీయాల్లోకి వెళ్ళే అవకాశం ఇంతకు ముందే వచ్చిందని..కానీ పిల్లలు చిన్నవారు కావడం వలన వదులుకున్నానని చెప్పారు రేణూ దేశాయ్. రాజకీయాల్లోకి వెళ్ళడం తన జాతకంలోనే ఉందని అన్నారు. ఇప్పటికీ తనకు అదే కోరికని...కానీ తాను విధి రాతకు వ్యతిరేకంగా ప్రయాణిస్తున్నానని చెప్పుకొచ్చారు రేణు. ఓ పాడ్ కాస్ట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులో మాటను బయటపెట్టారు.  సామాజిక సేవ చేయడం అంటే తనకు ఆనందమని...ఏ చిన్నారీ ఆకలితో ఉండకూడదని అనుకుంటానని ఆమె తెలిపారు. అయితే తాను కొంచెం ముక్కు సూటి మనిషిని...స్నేహితులు, పిల్లలతో ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తానని...అందుకే వారు తాను పోలిటిక్స్ లో పనికి రానని అంటారని నవ్వూతూ చెప్పారు రేణూ దేశాయ్. 

మోడీ భక్తురాలిని..బీజేపీకే సపోర్ట్..

తాను ఎప్పటికీ మోడీనే సపోర్ట్ చేస్తానని...ఆమె భక్తురాలిని అని నిర్భయంగా చెప్పుకున్నారు రేణు. మన ధర్మం ఎలా బతకాలో, ఎలా నడుచుకోవాలో నేర్పించింది. అందుకే నేను సనాతురాలినే అని చెప్పుకుంటాననన్నారు ఎవరేం అనుకున్నా ఎప్పటికీ తాను బీజేపీకే సపోర్ట్ చేస్తానని చెప్పుకొచ్చారు. భవిష్యత్తులా తాను ఏదైనా పార్టీలో చేరితే కచ్చితంగా అందరికీ చెప్పే చేస్తానని రేణూ దేశాయ్ అన్నారు. ఇక ఆమె కుమారుడు అకీరా నందన్ గురించి చెబుతూ...ఓజీ సినిమాలో అతను పని చేయడం లేదని తెలిపారు. అకీరా నటన గురించి ఆలోచించిన రోజే నా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెడతా. కొందరు యూట్యూబర్లు మనీ కోసం తప్పుడు థంబ్‌నైల్స్‌ పెడుతున్నారు రేణూ ఆరోపించారు. 

today-latest-news-in-telugu | renu-desai | actress | inter-view

Also Read: WHO: మరో మహమ్మారి తప్పదు-WHO చీఫ్

Advertisment
Advertisment
Advertisment