Watch Video: రీల్స్‌ చేస్తుండగా మహిళ మెడలోని గొలుసు లాక్కెళ్లిన బైకర్.. వీడియో వైరల్

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఓ మహిళ రీల్‌ చేస్తుడంగా.. బైక్‌పై వెళ్తున్న వ్యక్తి ఆమె మెడలోనుంచి మంగళసూత్రం లాక్కొని పారిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

New Update
Watch Video: రీల్స్‌ చేస్తుండగా మహిళ మెడలోని గొలుసు లాక్కెళ్లిన బైకర్.. వీడియో వైరల్

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లాలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. సోషల్‌మీడియాలో రీల్ చేస్తున్న మహిళ మెడలోనుంచి బైక్‌పై వచ్చిన ఓ వ్యక్తి మంగళసూత్రం లాక్కొని పారిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఇందిరాపురం ప్రాంతానికి చెందిన ఓ మహిళ రీల్‌ చేస్తూ మెల్లగా వీధిలో నడుస్తుంది. అయితే ఇదే అవకాశంగా భావించిన ఓ వ్యక్తి బైక్‌పై ఆమె వద్దకు బైక్‌పై వచ్చాడు. వెంటనే ఆమె మెడలోనుంచి మంగళసూత్రాన్ని లాక్కొని పారిపోయాడు.

Also read: 18 మందితో జనసేన అభ్యర్థుల ప్రకటన

అయితే ఈ గొలుసు దొంగను అడ్డుకునేందుకు ఆమె ప్రయత్నించింది. కానీ ఫలితం లేకపోయింది. చివరికి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుడి బైక్‌ నంబర్‌ ప్లేట్‌ ఆధారంగా అతడ్ని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే నిందితుడు ఆ మహిళ మెడలోనుంచి మంగళసూత్రాన్ని లాక్కెన దృశ్యాలు.. రీల్‌ చిత్రీకరిస్తున్న వీడియోలో రికార్డ్‌ అయ్యింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. నెటిజన్లు విభిన్న రీతిలో కామెంట్లు చేస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

GT VS SRH: హైదరాబాద్ ఇక ఇంటికి వెళ్ళిపోయినట్లే...వరుసగా నాలుగో ఓటమి

హైదరాబాద్  సన్ రైజర్స్ ఇంక ఇంటికి వెళ్ళిపోయినట్లే. ఈరోజు కూడా గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోయి వరుసగా నాలుసార్లు ఓటమిని చవి చూసింది. ఏడు వికెట్ల తేడాతో హైదరాబాద్ మ్యాచ్ ను పోగొట్టుకుంది. 

New Update
ipl

GT VS SRH

సొంత గ్రౌండ్ లో హైదరాబాద్ మళ్ళీ ఓడిపోయింది. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. హైదరాబాద్ ఇచ్చిన 153 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ 16.4 ఓవర్లలో కేవలం 3 వికెట్లు కోల్పోయి పూర్తి చేసింది.  గుజరాత్ కెప్టెన్ శుభ్ మన్ గిల్ 61 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 49 పరుగులతో రాణించారు. హైదరాబాద్ బౌలర్స్ లో షమీ 2, రమిన్స్ ఒక వికెట్ తీశారు.  

గుజరాత్ బౌలర్లు తాట తీశారు..

అంతకు ముందు ఉప్పల్ స్డేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన సన్‌రైజర్స్ ను గుజరాత్ టైటాన్స్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ దారుణంగా దెబ్బకొట్టాడు. నాలుగు ఓవర్లలో  కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన నాలుగు వికెట్లు తీశాడు.  ట్రావిస్ హెడ్ (8), అభిషేక్ శర్మ (18) లను మొదట్లోనే  వెనక్కి పంపిన సిరాజ్.. డేంజరెస్ ఆటగాడు అనికెత్ వర్మ(18) ను ఎల్బీగా వెనక్కి పంపించాడు. సన్‌రైజర్స్ ఆటగాళ్లలో నితీష్ కుమార్ రెడ్డి(31), హెన్రిచ్ క్లాసెన్(27), పాట్ కమ్మిన్స్ (22) పరుగులు చేశారు.  గుజరాత్ బౌలర్ లో మహమ్మద్ సిరాజ్ నాలుగు వికెట్లు తీయగా.. ప్రసిద్ధ్ కృష్ణ, సాయి కిషోర్ చెరో రెండు వికెట్లు తీశారు.  

today-latest-news-in-telugu | IPL 2025 | gt-vs-srh 

Also Read: Jibli Trend: జిబ్లీలో ఫోటోలు అప్ లోడ్ చేస్తున్నారా..అయితే జాగ్రత్త

Advertisment
Advertisment
Advertisment