Karnataka: దారుణం.. కూతురు ప్రైవేట్ వీడియోలు సోషల్ మీడియాలో పెట్టిన తండ్రి కర్ణాటకలోని ఉడిపిలో కుమార్తె ప్రైవేటు వీడియోలను తీసిన సొంత తండ్రే సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ఆ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వేరే యువకుడిని కూతురు ప్రేమించడంతోనే ఆ తండ్రి ఈ దారుణానికి పాల్పడ్డాడు. By B Aravind 13 Jul 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి కర్ణాటకలో అమానుష సంఘటన జరిగింది. కుమార్తె ప్రైవేటు వీడియోలను తీసిన సొంత తండ్రే సోషల్ మీడియాలో షేర్ చేయడం కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఉడుపికి చెందిన ఓ వ్యక్తి కుమార్తె (18 ఏళ్లు) దగ్గరి బంధువైన ఒక కుర్రాడిని ఇష్టపడింది. కానీ వీళ్ల ప్రేమ వ్యవహారం యువతి తండ్రికి ఇష్టం లేదు. దీంతో కూతురును రోజూ వేధిస్తూ ఉండేవాడు. అడ్డొచ్చిన తల్లిని కూడా కొట్టేవాడు. ఒకరోజు ఆ యువకుడిని ఇంటికి పిలిపించి కొట్టాడు. అతడి ఫోన్లో ఉన్న కూతురి వ్యక్తిగత వీడియోలు బలవంతగా తీసుకున్నాడు. ఆ తర్వాత ఈ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. Also Read: ఎన్డీయేకు షాక్.. 10 చోట్ల ఇండియా కూటమి విజయం అవి వైరల్ కావడంతో ఆ యువతి అవమానం తట్టుకోలేక ఆ యువతి ఆత్మహత్యకు ప్రయత్నించింది. సకాలంలో బంధువులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లడంతో ప్రాణాలు దక్కాయి. కుమార్తెను వేధిస్తున్నాడంటూ భర్తపై భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు దీనిపై విచారణ చేపట్టారు. Also Read: మధ్యంతర బడ్జెట్ లో ఇచ్చిన హామీ ఇప్పుడు ఆర్ధికమంత్రి నెరవేరుస్తారా? #telugu-news #national-news #social-media సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి