/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/woman-complaining-to-SI-in-a-police-station-has-gone-viral-A-video-1-jpg.webp)
Video Viral: 26 రోజులుగా దర్యాప్తు కొనసాగుతున్నప్పటికీ పోలీసు అధికారులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంలో జాప్యం చేయడంతో మహిళ చేసిన పని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మధ్యప్రదేశ్‌లోని రేవాలో ఒక పోలీసు అధికారికి మహిళ హారతి ఇస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో మహిళ, తన భర్త, కుమార్తెతో కలిసి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లింది.
पुलिस की आरती! पीड़ित परिवार ने दुखी होकर उतारी आरती. मामला MP के रीवा सिटी कोतवाली का है.
यहां पुलिस की कार्रवाई से तंग आकर अनुराधा सोनी अपने पति व दो छोटे बच्चों के साथ थाने पहुंची और थाना प्रभारी की आरती उतारने लगी.दरअसल पीड़िता चोरी के मामले में पुलिस की ढुल मूल कार्यशैली… pic.twitter.com/Na6JTt9Oqh
— Priya singh (@priyarajputlive) April 10, 2024
కేసు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరితే దానికి పోలీస్ అధికారి నిరాకరించడంతో ఆమె భర్త అతనికి దండ వేయగా మహిళ దీపాలు వెలిగించి మంగళహారతి ఇచ్చింది. ఈ వీడియో చాలా త్వరగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనికి లైక్‌లు, కామెంట్‌ల వర్షం కురుస్తోంది. 26 రోజులుగా విచారణ జరుగుతున్నా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం లేదనే కోపంతో అధికారికి బుద్ధిరావాలని ఇలా చేశానని మహిళ చెబుతోంది. ఘటనపై సోషల్ మీడియా యూజర్లు తీవ్రంగా స్పందించారు.
ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకపోవడం నేరం.. అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే పోలీసులకు ఇలానే చేయాలంటూ కామెంట్లు చేస్తున్నారు. ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు. మహిళ మంచి పనిచేసిందని, ఇలాంటి అధికారులకు అలాంటి గుణపాఠమే చెప్పాలంటూ విరుచుకుపడుతున్నారు.
ఇది కూడా చదవండి: డ్రైవర్ అవతారం ఎత్తిన హిట్‌మ్యాన్.. ఎందుకో తెలుసా..?
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.