Viral News: గోవా అని చెప్పి అయోధ్యకు తీసుకెళ్లాడు.. సీన్ కట్ చేస్తే విడాకులు! మధ్యప్రదేశ్ భోపాల్‌లో జరిగిన ఓ ఘటన చర్చనీయాంశంగా మారింది. గోవా తీసుకెళ్తా అని చెప్పి.. చివరి నిమిషంలో భర్త అయోధ్యకు తీసుకెళ్లాడని ఓ భార్య విడాకులకు అప్లై చేసింది. తనను మంచిగా చూసుకోవడం లేదని ఆయన సొంత కుటుంబసభ్యులకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నాడని ఆరోపించింది. By Trinath 25 Jan 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Ayodhya News: దేశమంతా రామభక్తికి మునిగిపోయింది. అయోధ్యకు వెళ్లి రామ్‌లల్లాను ఎప్పుడు.. ఎలా చూడాలని అందరూ ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు దీనికి పూర్తి భిన్నంగా ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. తన భర్త తనను అయోధ్య, వారణాసి సందర్శనకు తీసుకెళ్లినందుకు ఓ మహిళ విడాకులకు అప్లై చేసింది. మధ్యప్రదేశ్ భోపాల్‌లో జరిగిన ఈ ఘటన సోషల్‌మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అసలేం జరిగిందంటే? తన భర్త ఐటీ రంగంలో పనిచేస్తూ బాగా సంపాదిస్తున్నాడని విడాకుల పిటిషన్‌లో పేర్కొంది. తాను కూడా బాగా సంపాదిస్తుందట. ఇలాంటి పరిస్థితుల్లో హనీమూన్ కోసం విదేశాలకు వెళ్లడం పెద్ద విషయం కాదని.. అయినప్పటికీ విదేశాలకు తీసుకెళ్లడానికి భర్త నిరాకరించాడని పిటిషన్‌లో చెప్పుకొచ్చింది. గోవా వెళ్లాలని భర్త కోరాడట. తర్వాత అయోధ్య, వారణాసికి విమానాలు బుక్ చేశాడట. ఈ విషయాన్ని ఒకరోజు ముందు భార్యకు చెప్పాడు. రామమందిర వేడుకలకు ముందు తన తల్లి అయోధ్యకు వెళ్లాలనుకుంటున్నట్లు భర్త చెప్పాడని, అందుకే తాము అయోధ్యకు వెళ్తున్నామని ఆ మహిళ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేసింది . మహిళ 10 రోజులు ఏమీ మాట్లాడలేదని.. కానీ తిరిగి వచ్చిన వెంటనే, ఆమె ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్‌ను దాఖలు చేసింది. అంతే కాదు తన భర్త ఆయన సొంత కుటుంబాన్ని ఎక్కువగా చూసుకుంటాడని కూడా ఆ ప్రకటనలో పేర్కొంది. అందుకే ఈ సంబంధాన్ని వదిలించుకోవాలని చెప్పింది. నిజానికి ఈ జంట యాత్రకు బయలుదేరినప్పుడు హ్యాపీగానే వెళ్లారు. తిరిగి వచ్చిన తర్వాత తీవ్ర వాగ్వాదానికి దిగారు.. ఇదే ఆ మహిళను తన భర్త నుంచి విడాకుల కోసం దాఖలు చేయడానికి దారితీసింది. Also Read: రిటైర్ అవ్వలేదు.. అంతా అబద్ధం.. కుండబద్దలు కొట్టిన మేరికోం! #ayodhya #goa #madyapradesh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి