/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/WINES-CLOSED-jpg.webp)
MLC Elections: మందుబాబులకు మరోసారి షాక్ తగలనుంది. దేశంలో ఎన్నికల వేళ ఇప్పటికే వైన్స్, బార్లు వరుసగా మూసివేస్తుండగా మరోసారి 48 గంటలపాటు మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. తెలంగాణలో గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖకు పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఎన్నికల పోలింగ్ జరిగే మూడు జిల్లాల్లో..
ఈ మేరకు మే 27న వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల పట్టభద్రులు ఎమ్మెల్సీ ఉపఎన్నికలో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల పోలింగ్ జరిగే మూడు జిల్లాల్లో వైన్స్ షాపులు, బార్లను 48 గంటల పాటు బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఉప ఎన్నిక నేపథ్యంలో మే 25 సాయంత్రం 4.00 గంటల నుంచి 27న సాయంత్రం 4.00 గంటల వరకు వైన్ షాపులు, బార్‌లు మూతపడనున్నాయి. ఉపఎన్నిక బరిలో మొత్తం 52 మంది అభ్యర్థులున్నారు. మూడు ఉమ్మడి జిల్లాల్లో కలిపి మొత్తం 4,61,806 మంది పట్టభద్రుల ఓటర్లున్నారు.