MLC Election: ఏపీలో మోగిన మరో ఎన్నిక నగారా!
విజయనగరం స్థానిక సంస్థల కోటా MLC ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 28న విజయనగరం జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. ఈ నెల 4 నుంచి 11 వరకు నామినేషన్ల స్వీకరణ, 12న పరిశీలన ఉండనుంది. రఘురాజుపై అనర్హత వేటుతో ఈ ఎన్నిక అనివార్యం అయింది.