Karimnagar MLC results: కరీంనగర్ గ్రాడ్యుయేట్ MLC ఫలితాల్లో బిగ్ ట్విస్ట్

కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ MLC ఎన్నికల కౌంటింగ్‌లో ఊహించని మలుపు తిరిగింది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఫలితం తేలలేదు. కాసేపట్లో రెండో రౌండ్ ఫలితాల లెక్కింపు ప్రారంభమవుతుంది. 2 లక్షల 24 వేల ఓట్లలో 28వేలు చెల్లని ఓట్లు ఉన్నాయి.

New Update
Karimnagar Graduate MLC results

Karimnagar Graduate MLC results Photograph: (Karimnagar Graduate MLC results)

కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ MLC ఎన్నికల కౌంటింగ్‌లో ఊహించని మలుపు తిరిగింది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఫలితం తేలలేదు. కాసేపట్లో రెండో రౌండ్ ఫలితాల లెక్కింపు ప్రారంభమవుతుంది. 2 లక్షల 24 వేల ఓట్లలో 28వేలు చెల్లని ఓట్లు ఉన్నాయి. అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి సి. అంజిరెడ్డి పుంజుకున్నారు. పదో రౌండ్ పూర్తయ్యేసరికి అంజిరెడ్డి 4,562 ఓట్ల ఆధిక్యం కనబరిచారు.

Also read: singer kalpana: పోలీసుల అదుపులో సింగర్ కల్పన భర్త ప్రసాద్‌

కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డిపై అంజిరెడ్డి ఆధిక్యం కొనసాగుతున్నారు. మొదటి రౌండ్ నుంచి ఐదో రౌండ్ వరకు అంజిరెడ్డి లీడ్ ఉండగా.. ఆరో రౌండ్ నుంచి తొమ్మిదో రౌండ్ వరకు నరేందర్‌రెడ్డి లీడ్ లో ఉన్నారు.  పదో రౌండ్‌ కౌంటింగ్ వచ్చే సరికి ఫలితాలు తలకిందులైయ్యాయి.  ఎవరు గెలుస్తారనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. నువ్వా నేనా అన్నట్లుగా కౌంటింగ్ సాగుతోంది. 

Also read: posani: దెబ్బ మీద దెబ్బ.. పోసానికి మరో కేసులో 14 రోజులు రిమాండ్

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు